పవన్‌ పెట్టబోతున్నది కామానా, ఫుల్‌స్టాపా?

0
614
Pawan's movies say that close friends say

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan's movies say that close friends say
పవన్‌ కళ్యాణ్‌ జనసేన పేరుతో మూడు సంవత్సరాల క్రితమే పార్టీని ప్రారంభించాడు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం పవని తన పార్టీని రంగంలోకి దించలేదు. ఈ మూడు సంవత్సరాలుగా అప్పుడప్పుడు పవన్‌ పార్టీ పేరుతో ప్రజల్లోకి పోవడం, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిపై ప్రభుత్వంతో పోరాడటం చేస్తున్నాడు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు సాధించాలని పవన్‌ భావిస్తున్నాడు. అందుకోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరంగా ఉంటాడా అనే ప్రచారం జరుగుతుంది. కాని పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు పూర్తిగా జరగలేని పరిస్థితి.

పవన్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన సినిమాలు తప్ప మరే ఆదాయ మార్గం లేని వ్యక్తి. రాజకీయ పార్టీని నడిపేందుకు పవన్‌ వసూళ్లకు ప్పాడే వ్యక్తి కాదు. అందుకే జనసేన పార్టీని నడిపించాలి అంటూ పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎన్నికల తర్వాత సీఎంగా అయితే ఏమో కాని, ఇప్పుడు మాత్రం ఆయన ముందు మరో మార్గం లేదు. ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మరో ఒకటి లేదా రెండు సినిమాల్లో చేసి ఆ తర్వాత కొంత కాలం కామా పెట్టి మళ్లీ కూడా పవన్‌ సినిమాల్లో నటించే అవకాశాలున్నాయి. కావున పవన్‌ ఫ్యాన్స్‌ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు.

Leave a Reply