Posted [relativedate]
వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఒకప్పుడు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భయం ఉండేదని, ప్రస్తుతం మోడీ (ప్రధాని నరేంద్ర మోదీ) భయం పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు.జగన్ కు జ్వరం వచ్చింది పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రకటించడం వల్లనే అని, నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడాన్ని కరెక్ట్ అని అన్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం చేసినప్పుడే దీనిపై మాట్లాడామని చెప్పారు.
కేశవ్ శుక్రవారమిక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టుతో నష్టమని జగన్ గతంలో ఢిల్లీ వెళ్లి ప్రధానికి చెప్పారని, కానీ ఆ ప్రాజెక్టు వల్ల నష్టం జగన్‌కు, వైసీపీకే నష్టమని రుజువైందని . పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 15 టీఎంసీలు రాయలసీమకు వస్తేనే పండుగగా ఉందని, అదే సముద్రంలోకి పోతున్న 2,800 టీఎంసీల నుంచి 80 టీఎంసీలను సీమకు మళ్ల్ళిస్తే ఆ సంతోషం చెప్పనలవి కాదని తెలిపారు. ‘భగీరథుడిని మించిన అపర గౌతముడు చంద్రబాబు’ అని కీర్తించారు. భగీరథుడు కేవలం తమ పితరుల కోసం గంగను భూమిపైకి రప్పించాడని, గౌతముడు ప్రజల మేలు కోసం గోదావరిని భూమార్గం పట్టించారని పేర్కొన్నారు.తెలుగు దేశం పార్టీ కూడా ప్రజల మేలు కోసమే పుట్టిందని అన్నారు .