ఒకే కుటుంబంలో ఎన్టీఆర్, లోకేష్ ఫ్రెండ్స్…

 peddi ramarao ntr lokesh common friend

రాజకీయాల్లో, సినీ రంగంలో ఒక క్యాంపులో వుండే వ్యక్తి మరో క్యాంపులో దగ్గరగా వుండాలంటే చాలా కష్టం. ఆలా రెండో క్యాంపు దగ్గరకి వెళ్లినా వాళ్ళని నమ్మడం మరి కష్టం…ఇపుడు ఎన్టీఆర్, లోకేష్ ల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అందరికి తెలుసు. పైకి విమర్శలు, వాగ్భాణాలు లేకపోయినా రెండు క్యాంపుల మధ్య తీవ్ర వైరుధ్యాలున్న విషయం తెలిసిందే. కానీ ఆ ఇద్దరి క్యాంపుల్లోని కీలక మిత్రులు మాత్రం ఒకే కుటుంబం నుంచి వస్తారు. ఆ ఇద్దరు ఎవరో ఆ రెండు క్యాంపుల ఇన్నర్ సర్కిల్స్ కి బాగా తెలుసు.

వారిలో ఎన్టీఆర్ మిత్రుడు రాజీవ్ కనకాల ఒకరు. ఆ ఇద్దరు ఎంత స్నేహంగా ఉంటారో ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ రాజీవ్ చెల్లెల్ని చేసుకొన్న పెద్ది రామారావు అనే ఆయన లోకేష్ వ్యూహ బృందంలో ఒకరని మాత్రం చాలా కొద్దిమందికి తెలుసు. ఈ బావ బావమరుదులిద్దరూ మంచి స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తారు. కానీ పెద్దగా సఖ్యత లేని బావాబావమరుదులు లోకేష్, ఎన్టీఆర్ కి ఈ ఇద్దరూ సన్నిహితంగా మెసులుతున్నారు. వీరిలో పెద్ది రామారావు … 2009 లో ఎన్టీఆర్ సభలకి ప్రసంగాలు తయారుచేశారు కూడా!. నాటి ప్రతిస్పందన చూసే లోకేష్ ఆయన్ను చేరదీశారు. తర్వాత కాలక్రమంలో లోకేష్ కి దగ్గరయ్యారు. రాజీవ్ మాత్రం మొదట్నుంచీ ఎన్టీఆర్ కి సన్నిహితంగానే వుంటున్నారు. ఈ బావబామ్మర్దులకి దగ్గరగా వుండటం విశేషమే!.

SHARE