ఆ సూపర్ హిట్ దర్శకుడికి కోపమొచ్చింది..

0
585
pelli choopulu director tharun bhaskar comments on IIFA awards

 Posted [relativedate]

pelli choopulu director tharun bhaskar comments on IIFA awards
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు పరిశ్రమలో కొత్త లెక్కలు రాసిన దర్శకుడు తరుణ్ భాస్కర్.పెట్టిన పెట్టుబడి కి వచ్చే రాబడికి ఇంత తేడా ఉంటుందా అని బడా నిర్మాతలంతా నోళ్లు వెళ్ళబెట్టుకుని చూసేలా చేసిన దర్శకుడు తరుణ్.ఆయన్ని నమ్మి నిర్మాత పెట్టిన ఖర్చుకి 20 రెట్లకుపైగా డబ్బులు వచ్చిన సినిమా పెళ్లిచూపులు.ఇక సృజనాత్మకంగా చూసినా కొత్త తరం ఇండివిడ్యువాలిటీ ని కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చేలా తీయగలిగారు.అందుకే ఆ పెళ్లిచూపులు సినిమాని మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు.హిందీలో అయితే స్టార్ ప్రొడ్యూసర్ వసు భగ్నానీ ఈ సినిమా రైట్స్ కొనుక్కున్నాడు.తొలి సినిమాతోనే ఇంత సక్సెస్ సాధించిన తరుణ్ భాస్కర్ కి కోపమొచ్చింది.స్టార్ హీరోలు,పెద్ద సినిమాల మీద మండిపోతున్నాడు ఈ యువ దర్శకుడు.దాని వెనుక వున్న రీజన్ ఇదే ..

గత ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో పెళ్లిచూపులు కచ్చితంగా మంచి సినిమానే.ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన ఈ సినిమాకి అవార్డ్స్ రాకపోవడం తరుణ్ భాస్కర్ ని ఇబ్బంది పెట్టింది.పెళ్లి చూపులు రిలీజ్ అయ్యాక హైదరాబాద్ లో రెండు భారీ అవార్డు ఫంక్షన్స్ జరిగాయి.రీసెంట్ గా ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కూడా చూసాం.అయితే ఈ ఫంక్షన్స్ లో స్టార్ అట్రాక్షన్ తీసుకురావడం కోసం సహజంగానే పెద్ద సినిమాలకి పెద్ద పీట వేస్తున్నారు.ఈ సూక్ష్మం తరుణ్ భాస్కర్ కి రుచించలేదు.ఓ మంచి సినిమాని గుర్తించని వారిపై మండిపడుతున్నాడు.ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసాడు.అంతటితో ఆగకుండా ఫ్యూచర్ లో తాను స్టార్స్,మార్కెట్ డిమాండ్స్ కి తలొగ్గబోనని చెప్పేసాడు.ఈ ప్రకటన కాస్త దూకుడుగా అనిపించినా తరుణ్ లోని పట్టుదల,చిత్తశుద్ధి కి అద్దం పడుతోంది.తరుణ్ లాంటి దర్శకులు ఇంకొందరు వస్తే ఆటోమేటిక్ గా వారు అనుకున్నది జరిగిపోతుంది.దానికోసం ప్రత్యేకంగా పోరాడవలసింది ఏమీ లేదు.

Leave a Reply