పెళ్లి చూపులు దర్శకుడికి అవమానం?

 pelli choopulu movie director tarun bhaskar got troubles
పెళ్లిచూపులు…చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది.రూపాయికి పదిరూపాయలు సంపాదించింది.అలాంటి సినిమా అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మీద ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.మాకో సినిమా చేసి పెట్టొచ్చుగా అని ఇండస్ట్రీ పెద్దమనుషులు అడుగుతున్నారు.ఇంతటి తీపి వర్తమానం వెనుక వున్న చేదు గతాన్ని పెళ్లిచూపులు 49 వ రోజు గుర్తు చేసుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

పెళ్లిచూపులు షూటింగ్..బిజినెస్ టైంలో భాస్కర్ పదేపదే చిన్నసినిమా చిన్న సినిమా అనే మాట వినాల్సి వచ్చిందట .కోటి లోపు ఖర్చుతో తీసే సినిమాలు తెలుగు పరిశ్రమ స్థాయికి సరిపోవని ..ఇది కూడా ఓ పెద్ద షార్ట్ ఫిలిం అని యూనిట్ లో వాళ్ళు కూడా కొందరు అన్నారట.పనికి సంబంధించి కూడా చాలా మంది అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని భాస్కర్ అన్నాడు.సినిమా తీయడం గురించి ప్రతి ఒక్కరు ఉచితాసలహాలు ఇచ్చేశారని చెప్పాడు.ఎన్ని జరిగినా పెళ్లిచూపులు విజయంతో పండగ చేసుకుంటున్న భాస్కర్ 50 రోజులు సందర్భంగా ప్రేక్షకులకి థాంక్స్ చెప్పుకున్నాడు.పైపై మాటలే తప్ప ప్రయోగాలు చేయడం చిత్ర పరిశ్రమలో ఎంత కష్టమో భాస్కర్ అనుభవాలు మరోసారి ప్రూవ్ చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here