పెద్ద హిట్ తర్వాత చిన్న సైన్మా ..

0
640

 pelli chupulu big hit after tarun bhaskar start sainma short film full movieటాలీవుడ్ లో ‘పెళ్లిచూపులు’ జోరు కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్ తో కొత్త నటులు – టెక్నీషియన్స్ తో తరుణ్ భాస్కర్ తెరకెక్కింతిన ఈ మూవీ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సినిమా వాళ్లనే కాదు.. కేటీఆర్ లాంటి రాజకీయనాయకులు కూడా ఈ సినిమా చూసి మెచ్కుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ రేంజ్ సక్సెస్ సాధించిన తర్వాత.. ఏ కొత్త దర్శకుడైనా పెద్ద నటుడిని డైరక్ట్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ తరుణ్ ప్లాన్ వేరేలా ఉంది. ఇప్పుడే స్టార్ల జోలికి వెళ్లనంటున్నాడతడు. గతంలో తీసిన సైన్మా అనే షార్ట్ ఫిలింను పూర్తి స్థాయి సినిమాగా మలచాలనుకుంటున్నట్లు చెప్తున్నాడు.

తెలంగాణ వాసుల జీవితాలకు సంబంధించిన సైన్మా సబ్జెక్ట్ ను.. అనేక పాత్రలతో వినోదాత్మకంగా మలచనున్నాడట. ఇది మాల్గుడి డేస్ తరహాలో ఉంటుందని చెప్పాడు. ఈ చిత్రాన్ని తప్ప.. ఇప్పట్లో పెద్ద స్టార్లతో సినిమా తీసే ఆలోచన లేదని తేల్చేశాడు తరుణ్ భాస్కర్. ఈ సబ్జెక్ట్ తో రెండో సక్సెస్ కూడా సాధిస్తే.. ఇక ఇతగాడికి డిమాండ్ మామూలుగా ఉండదు లెండి.

Leave a Reply