ఆ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్..బయట స్వీట్స్,ఫుల్ పటాస్

0
533
people celebrating rides on durgaprasad house

Posted [relativedate]

people celebrating rides on durgaprasad house
ఓ ప్రభుత్వ అధికారి ఇంటి మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరపడం సర్వసాధారణం.అయితే ఆ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని ఆ అధికారి బాధితులు అక్కడికి చేరుకొని స్వీట్స్ పంచడం,పటాస్ లు పేల్చడం మాత్రం ఇదే మొదటి సారి.ఈ పరిణామం చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు.ఆ అధికారి ప్రవర్తనకి ఈ ఘటన అద్దం పడుతుందని స్థానికులు అనుకుంటున్నారు.ఇంతోటి ఘనత సొంతం చేసుకున్న ఆ అధికారి పేరు దుర్గా ప్రసాద్. ఒంగోలు పీటీసీ డీఎస్పీ గా పనిచేస్తున్నారు.గుంటూరు బ్రాడీపేటలో ఈయన నివాసం ఉంటే ఆస్తులు మాత్రం గుంటూరు,ఒంగోలు,హైదరాబాద్ లో విస్తరించాయి.అయ్యగారి గురించి తెలుసుకున్న ఏసీబీ ఒక్కసారిగా అయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించింది.

people celebrating rides on durgaprasad house ఈ దాడుల్లో దొరికిన ఆస్తుల వివరాలు ఇంకా బయటికి రాకపోయినా దుర్గా ప్రసాద్ అవినీతి భాగోతం గురించి సామాన్యులకి కూడా తెలుసట.ఈయన వల్ల గతంలో ఇబ్బందులు పడినవారు దాడుల వార్త తెలియగానే అక్కడికి వచ్చి స్వీట్స్ పంచుతూ …పటాస్ లు పేలుస్తూ సందడి చేశారు. దారిన పోయేవాళ్లు విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు.అవినీతి అధికారుల వల్ల జనం పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటనకి మించిన ఉదాహరణ ఏముంటుంది?

Leave a Reply