హారతి ఇచ్చి దండేసి దణ్ణం పెట్టారు ఎందుకో తెలుసా .?

160
Spread the love

Posted [relativedate]

people praying to atmsఢిల్లీలోని జగత్‌పురా ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఖాతాదారులు వినూత్న రీతిలో త‌మ నిర‌స‌న‌ను తెలిపారు. డబ్బుల కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన 50 మంది ఖాతాదారులు ఏటీఎంకి పూజలు చేశారు. దానిపై పూలమాలలు వేసి డప్పు వాయిద్యాల తో హారతి పట్టి త‌మ నిర‌స‌న‌ను తెలిపారు.

కేంద్ర‌ప్ర‌భుత్వం 500 ,1000 పెద్ద‌నోట్లను ర‌ద్దు చేసి 27 రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ బ్యాంకులు, ఏటీఎం లు ప్రజల అవ‌స‌రాల‌ ను తీర్చ లేక పోతున్నాయి . దీంతో ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాంకుల‌తో పాటు ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు క‌నిపిస్తుండ‌డంతో వారు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లోనే త‌మ‌ సమస్యలను ప్ర‌భుత్వానికి తెలియజేయడానికే ఇలా నిర‌స‌న తెలిపామ‌ని వారంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here