ఓ అమ్మ ఎదురుచూపు… ATM కష్టాలు

Posted December 4, 2016

 people suffer before atms

గళ్ళ చొక్కా , నల్ల ప్యాంట్ వేసుకుని , తలకి కొబ్బరినూనె రాసుకుని , పక్క పాపిడి తలదువ్వుకుని , ముఖానికి పాండ్స్ పౌడరు రాసుకుని , పాలిష్ చేసిన బాటా బూట్లేసుకుని వెళుతూ వెళుతూ “అమ్మా ! ATM కి వెళ్ళొస్తా ” అని మూడ్రోజుల క్రితం చెప్పి వెళ్ళాడు . ఇంత వరకూ ఇంకా ఇంటికి రాలేదు .

బాబూ రాంబాబు , నువ్వు ఏ ATM దగ్గర లైన్లో ఉన్నా , వెంటనే ఇంటికి వచ్చేయి బాబూ. నీకోసం ఇక్కడ పనిమనిషి , పాలవాడు , పేపరువాడు ,పిల్లల స్కూలు బస్సు వాడు , చేబదులు ఇచ్చిన పక్కింటి పిన్నిగారు అందరూ నువ్వెప్పుడొస్తావా అని బెంగతో మంచం పట్టారు .

నువ్వు తప్పకుండా డబ్బు తీసుకొస్తావని వేయి కళ్ళతో మేమందరము ఎదురుచూస్తున్నాము .

ఇట్లు :

మీ అమ్మ .

SHARE