పెప్సీ, కోలాల‌పై బ్యాన్!!

0
599
pepsi and cococola are banned

Posted [relativedate]

pepsi and cococola are banned
అనుకున్న‌ది సాధించ‌డంలో త‌మిళ తంబీల త‌ర్వాతే ఎవ‌రైనా. ఆమ‌ధ్య జ‌ల్లిక‌ట్టుపై ప‌ట్టుబ‌ట్టి సాధించారు. ఇప్పుడు పెప్సీ, కోలాల విష‌యంలో పెద్ద స్కెచ్చే వేశారు. ఇప్పుడు ఏకంగా ఆ రెంటిని బ్యాన్ చేసేశారు. త‌మిళ‌నాడు వ్యాపారుల సంఘం… ఈ రెండు కూల్ డ్రింకుల‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

పెప్సీ, కోక్ ల‌ను నిషేధిస్తూ త‌మిళ‌నాడు వ్యాపారులు తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే త‌మిళ‌నాడు రైతులు ఇప్పుడు క‌రువుతో అల్లాడుతున్నారు. నీటికి చాలా క‌ట‌క‌ట ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో చెన్నై శివార్ల‌లోని ఈ కంపెనీలు విప‌రీతంగా నీటిని వాడేస్తున్నాయ‌ట‌. పెద్ద పెద్ద మోట‌ర్లు పెట్టి భూగ‌ర్భ‌జ‌లాల‌ను తోడేస్తుండ‌డంతో వాటికి చెక్ పెట్టేందుకు కూల్ డ్రింకుల‌పై నిషేధం విధించేశారు. ఫ‌లితంగా ఫారిన్ కూల్ డ్రింక్ కంపెనీల‌కు గ‌ట్టి షాకే ఇచ్చారు. ఎందుకంటే త‌మిళ‌నాడులో పెప్సీ, కోక్ ల బిజినెస్ వంద‌ల కోట్ల‌లో ఉంటుంది. ఇప్పుడా ఖ‌జానాకు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టే.అయితే జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మ స‌మ‌యం నుంచే ద‌శ‌ల వారీగా కూల్ డ్రింకుల‌పై ద‌శ‌ల వారీగా నిషేధం కొన‌సాగుతూ వ‌స్తోంది. తాజాగా మొత్తానికే బ్యాన్ ప‌డింది. కేవ‌లం పెద్ద రెస్టారెంట్లు, బార్ల‌లో మాత్ర‌మే ఈ డ్రింక్స్ అందుబాటులో ఉండ‌నున్నాయి.

పెప్సీ, కోక్ ల‌పై నిషేధం విధించిన త‌మిళ వ్యాపారులు… స్థానికంగా త‌యార‌య్యే డ్రింక్స్ కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరుతున్నారు. దీంతో ఇన్నాళ్లు మ‌రుగున ప‌డిపోయిన గోలీసోడా, కొబ్బ‌రిబొండం వ్యాపారాల‌కు అక్క‌డ మంచిరోజులు రానున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జ‌రిగితే ఎంత బావుంటుందో..!!! ఎంతోమంది స్థానిక వ్యాపారుల‌కు ఉపాధి ల‌భిస్తుంది!!! ఏదేమైనా త‌మిళ‌నాడు వ్యాపారులు తీసుకున్న నిర్ణ‌యం దేశం మొత్తానికి ఆద‌ర్శం కావాల‌ని కోరుకుందాం!!

Leave a Reply