Posted [relativedate]

- ఫోన్ పోతే గజనీ అవుతున్నారా..
- సన్నిహితుల నంబర్ల కోసం వెతుకులా..
- గూగుల్ కాంటాక్ట్స్‌తో చెక్ చెప్పండి మరి..
మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తికి కాల్ చేస్తే ‘హలో ఎవరు’ అని అడిగితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.. బాగా చనువుంటే నా నంబరు కూడా లేదా అంటే లేదు ఫోన్ మార్చాను.. లేదా ఫోన్ పోయింది అందుకే నంబర్లన్నీ మొత్తం పోయాయి అంటూ సమాధానం వస్తూఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇటువంటి ఫేస్చేసే ఉంటారు.. మీరు కూడా నంబర్ల నిత్యం పోయి ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ సమస్యకు గూగుల్ కాంటాక్ట్స్ స్పష్టమైన పరిష్కారం.. దీన్ని నుంచి బయటపడాలంటే ఆండ్రాయిడ్ యూజర్లకు ఒక అవకాశం ఉంది. ఏ నంబరు సేవ్ చేసిన అది ఫోన్, సిమ్ కాకుండా గూగుల్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి. మన జీ మెయిల్ ఐడీపైనే ఉండే ఈ అకౌంట్లోకే వెళతాయి.. అప్పటికే ఉన్న కాంటాక్ట్స్ కూడా గూగుల్ అకౌంట్లోకి కాపీ చేసుకోవచ్చు.. కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్‌చేసి ఫ్రమ్ అనే చోట సిమ్ నుంచా లేదా ఫోన్ మెమరీ నుంచా అనేది ఇవ్వాలి.. టు అనే చోట గూగుల్ కాంటాక్ట్స్ అని పెట్టాలి… అవి గూగుల్ ఖాతాలోకి చేరిపోతాయి…
సేవ్ చేస్తే సరిపోదూ..
గూగుల్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేశాం హమ్మయ్య అనుకోకండి.. మీ ఫోన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి సర్వర్‌కు అనుసంధానమైతేనే ఫలితముంటుంది. ఒక సారి ఇంటర్నెట్కు కనెక్ట్ అయి మన ఫోన్ నంబర్లన్నీ సింక్ అవుతాయి.. దాంతో నంబర్లు పోతాయనే ఒత్తిడి నుంచి ఫ్రీ అయినట్లే.. నెట్‌కు అనుసంధానం అనగానే బోళ్లంత డాటా ఖర్చుఅవుతుందేమో అని కంగారు పడాల్సిన పనిలేదు. మొత్తం కాంటాక్ట్స్‌కు 10 ఎంబీ కూడా తీసుకోదు.. ఒక వేళ ఆ ఖర్చు కూడా ఉండకూదంటే వైఫై ఉన్నప్పుడే సింక్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు…
ఫోన్లేకున్నా నంబర్లు చూసుకోవచ్చు…
జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఎడమ చేతివైపు పైన ‘జీమెయిల్’ అని ఉన్నచోట క్లిక్ చేస్తే కాంటాక్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకో కొత ్త పేజీ వచ్చి.. మన ఫోన్ నంబర్ల జాబితా వచ్చేస్తుంది.. అక్కడ కూడా మార్పులు చేసుకోవచ్చు.. అవి మన ఫోన్లో కూడా మారుతూ ఉంటుంది.
కొత్త ఫోన్లోకి క్షణాల్లో..
మన ఫోన్ పోయి కొత్తది తీసుకున్న మన సమాచారం ఎక్కడికి పోదూ.. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుని ఒక క్లిక్ ఇస్తే చాలు క్షణాల్లో మన ఫోన్ నంబర్లు పొందొచ్చు.. గూగుల్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చి… ఇంటర్నట్కి అనుసంధానం అయిన వెంటనే మొబైల్‌లోకి మొత్తం నంబర్లు వచ్చేస్తాయి. ఒక వేళ మనకు రెండు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నా ఒక దానిలో సేవ్ చేసిన, డిలీట్ చేసిన వేరే దాంట్లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మన ఫోను రెండు రోజులకు రిపేర్ ఇచ్చాం… తాత్కాలికంగా వేరే మొబైల్లో సిమ్ వేసుకున్నా అప్పుడు కూడా ఈ సౌకర్యం వాడుకోవచ్చు.. దీని వల్ల నంబర్లు లేక ప్రతి సారి ఎవరు అని అడాగాల్సిన అవసరం లేదు..

