లోకేష్ పై దేశం ఎమ్మెల్యే వ్యాఖ్య ..సాక్షి పండగ

0
727

Posted [relativedate]

 pithapuram tdp mla varma said lokesh white elephant
భావం మంచిదైనా భాష మీద పట్టు లేకపోతే ఏమి జరుగుతుందో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ.లోకేష్ కి అండగా వైసీపీ,జగన్ ని తూర్పారబట్టేందుకు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.చినరాజప్ప వ్యవహారంలో లోకేష్ తప్పేమీ లేదని చెప్పారు.లోకేష్ ప్రతిష్టను దెబ్బతీయడానికే జగన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.ఇంతలో ఆయనకి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయన్న సామెత గుర్తొచ్చింది.దాన్ని చెప్పాలన్న ఆరాటంలో తడబడ్డారు.ఏనుగు మీద.. తెల్ల ఏనుగు మీద బురద చల్లాలని ఎవరెంత ప్రయత్నించినా …ఏనుగు తన పని తాను చేసుకుంటుందని వర్మ వ్యాఖ్యానించారు.ఇంకేముంది ….అయన మాటల్లోని తెల్ల ఏనుగు అన్న దానికి ఇంగ్లీష్ అనువాదం చేసి…లోకేష్ ని వైట్ ఎలిఫెంట్ అన్న హెడ్డింగ్ పెట్టి సాక్షి పండగ చేసుకుంది.అంతోటి ఇంగ్లీష్ తెలిసిన సాక్షికి అమరావతిలో వుండే ఐరావతం కూడా తెల్ల ఏనుగుని తెలియదా?ఏదైనా చూసే కళ్లని బట్టి ఉంటుంది.

Leave a Reply