పిట్ట‌గోడ రివ్యూ

0
386
pittagoda review

Posted [relativedate]

pittagoda reviewచిత్రం : ‘పిట్టగోడ’

నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ – పునర్ణవి – జబర్దస్త్ రాజు – ఉయ్యాల జంపాల రాజు – శివ ఆర్.ఎస్ – శ్రీకాంత్ ఆర్.ఎన్ తదితరులు

సంగీతం: ప్రాణం కమలాకర్

ఛాయాగ్రహణం: ఉదయి

స్క్రీన్ ప్లే: రామ్మోహన్

నిర్మాత: రామ్మోహన్

కథ – మాటలు – దర్శకత్వం: అనుదీప్

ఈ సంవ‌త్స‌రం చాలా వరుకూ చిన్న సినిమాలే బాక్సాపీస్ ను రాజ్యం ఏలాయి. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో కుర్ర ద‌ర్శ‌కులు ఎంట్రీ ఇవ్వ‌డం వ‌ల్ల చిన్న సినిమాలు జనాన్ని ఆక‌ట్టుకోవ‌డంలో చాలా వ‌రుకూ స‌క్సెస్ అయ్యాయి. అదే కోవ‌లో వ‌చ్చిన మ‌రో చిన్న చిత్రం పిట్ట‌గోడ‌.  అనుదీప్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ సినిమా జ‌నాన్ని ఎంత వ‌రుకూ ఆక‌ట్టుకుంది? ఈ సినిమాకు విజ‌యావ‌కాశాలు ఎలా ఉన్నాయి..?  ప్రేక్ష‌కుల్ని ఆసక్తిగా కూర్చోబెడుతుందా?  చూద్దాం ప‌దండి.

క‌థ‌:

టిప్పు (విశ్వదేవ్ రాచకొండ) ఇంటర్లో ఆరు సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకుని.. తన స్నేహితులతో కలిసి పనీ పాటా లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు చెబుతూ కాలం గడిపేసే ఈ బ్యాచ్ అంటే వాళ్ల ఇంట్లో వాళ్లతో పాటు అందరికీ చులకనే. ఇలాంటి తరుణంలో వీళ్లుండే కాలనీకి దివ్య (పునర్ణవి) తన ఫ్యామిలీతో కలిసి వస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు టిప్పు. దివ్య తండ్రి.. టిప్పు తండ్రికి పై అధికారి కావడంతో వాళ్లింట్లో పనులన్నీ టిప్పు దగ్గరుండి చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఆమెకు టిప్పు ప్రపోజ్ చేయబోతే ఛీకొడుతుంది. తర్వాత అతడి మంచి తనం తెలుసుకుని ఫ్రెండుగా అంగీకరిస్తుంది. తర్వాత దవ్య కోసం చేసిన ఓ పని వల్ల టిప్పుతో పాటు అతడి స్నేహితులంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతకీ టిప్పు చేసిన ఆ పనేంటి.. దాని పర్యవసనాలేంటి.. చివరికి టిప్పుకు దివ్య దగ్గరైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

కథాపరంగా చెప్పుకోతగ్గ విషయం లేకపోయినప్పటికీ ఈ కొత్త వాళ్లతోనే సరదా సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ టైమ్‌ పాస్‌ అయిపోతుంది. కుర్రాళ్ల మధ్య సంభాషణలు, తండ్రులతో వారు పడే పాట్లు నవ్విస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా బాగా సెట్‌ అయింది. అయితే అటుపై ఆసక్తికరంగా నడిపించడానికి తగిన కాన్‌ఫ్లిక్ట్‌ కొరవడడంతో మెలోడ్రామా నిండిపోయి కథనం కుంటు పడింది. అక్కడ్నుంచీ అంతా కన్వీనియంట్‌గా, సినిమాటిక్‌గా మారిపోవడంతో అంతవరకు ఉన్న సహజత్వం కూడా మిస్‌ అయిపోయి పిట్టగోడ ఒక సగటు సినిమాగా మిగిలిపోయింది.

ప్లస్ పాయింట్స్ :

హీరో, హీరోయిన్స్

సిట్యువేష‌న‌ల్ కామెడీ

సంగీతం

మైన‌స్ పాయింట్స్ :

బ‌ల‌మైన పాయింట్ లేక‌పోవ‌డం

స్ట్కీన్ ప్లే లో ప‌ట్టుతగ్గిపోవ‌డం

న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ :

విశ్వదేవ్ రాచకొండ.. పునర్ణవి హీరో హీరోయిన్లలా అనిపించరు. వాళ్లలో ఆ ఫీచర్లూ లేవు. అలాంటి బిల్డప్పులూ ఇవ్వలేదు. కథలో వాళ్లూ మామూలు పాత్రధారుల్లా కనిపిస్తారు. ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పునర్ణవి హావభావాలు మెప్పిస్తాయి. కొత్త కుర్రాడు విశ్వదేవ్ రాచకొండ బాడీ లాంగ్వేజ్.. నటన అన్నీ కూడా క్యాజువల్ గా అనిపిస్తాయి. హీరో స్నేహితులుగా ముగ్గురూ బాగా చేశారు. నవ్వించే బాధ్యతను పంచుకున్నారు. విలన్ పాత్రధారి ఓకే. ఆ పాత్రకు బిల్డప్ మరీ ఎక్కువైంది. మిగతా నటీనటుల్లో చాలామంది కొత్తవాళ్లే. పర్వాలేదనిపించారు.

తెలుగు బుల్లెట్ అనాలిసిస్ :

పంచ్ డైలాగులు లేకుండా.. సిచువేషనల్ కామెడీతో పండించిన వినోదం ‘పిట్టగోడ’కు ప్లస్ పాయింట్. హీరో అతడి స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాల్లో కొన్ని చోట్ల బాగానే నవ్వులు పండాయి. సహజమైన తెలంగాణ యాసతో కొన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి. కానీ పాత్రధారులందరితోనూ ఒకే యాసను మాట్లాడించడంలో శ్రద్ధ పెట్టాల్సింది. ప్రధాన పాత్రధారుల సహజ నటన ఆకట్టుకుంటుంది. సాంకేతిక హంగులు కూడా బాగానే కుదిరాయి కానీ.. కథ మరీ సింపుల్ గా ఉండటం.. కథను ముందుకు నడిపించే బలమైన పాయింట్ ఏదీ కూడా సినిమాలో లేకపోవడం మైనస్. ఓవరాల్ గా ‘పిట్టగోడ’ అక్కడక్కడా కొంచెం ఆహ్లాదం పంచినా.. ప్రత్యేకమైన ముద్ర అయితే వేయదు.

బాట‌మ్ లైన్ : ప‌ట్టులేని గోడ

రేటింగ్ : 2.5 / 5

 

Leave a Reply