దీదీ మర్డర్ కు స్కెచ్చేశారా?

0
580

Posted [relativedate]

Image result for mamata banerjee
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హత్యకు ఎవరైనా కుట్ర చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. అంతేకాదు మమత విషయంలో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుపై గళమెత్తినందుకే ఇదంతా జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.

మమత ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొట్టింది. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా బీహార్‌లో నిర్వహించిన ర్యాలీ అనంతరం రాత్రి 7.35 గంటల సమయంలో మమత అక్కడ విమానం ఎక్కారు. వాస్తవానికి అది 6.35కే రావాల్సి ఉంది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానం అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ 9 గంటల సమయంలో ల్యాండయ్యింది. దీంతో దీదీని చంపేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ ఆరోపించింది.

మమత విషయంలో ఏదో జరుగుతుందడానికి టీఎంసీ పలు కారణాలను చెబుతోంది. విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ చెప్పినా.. ఏటీసీ మాత్రం విమానాన్ని గాల్లోనే ఉంచేసిందట. ఇది ముఖ్యమంత్రిని చంపడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కానే కాదంటున్నారు టీఎంసీ నాయకులు. పెద్దనోట్ల రద్దుపై పోరులో భాగంగా ఆమె దేశవ్యాప్తంగా తిరుగుతున్నందునే ఆమెను చంపాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు.

Leave a Reply