మెగా టైటిల్ మార్చేస్తున్నారట..!

dd1

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం చేస్తున్న కత్తి రీమేక్ టైటిల్ ఖైది నెంబర్ 150గా మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు ఆ టైటిల్ మార్చబోతున్నట్టు ఎక్స్ క్లూజివ్ టాక్. ఆల్రెడీ కెరియర్ లో ఖైది, ఖైది నెంబర్ 786 సినిమాలు చేసిన చిరు మళ్లీ ఇప్పుడు ఖైది నెంబర్ 150 టైటిల్ పెట్టడం అటు అభిమానుల నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుందట. అందుకే టైటిల్ చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

వి.వి.వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తుంది. రీసెంట్ గా చిరు సెట్ లో జాయిన్ అయిన కాజల్ చిరు పక్కన చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందంటూ చెబుతుంది. మరి ఓ సారి టైటిల్ ఫిక్స్ చేశాక మార్చడం అనేది అంతగా కలిసివచ్చే విషయం అనిపించట్లేదు. మరి రాం చరణ్, చిరులు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిరు సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అసలైతే సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమా అనుకున్న టైంలో కంప్లీట్ అయితే ముందుగానే వచ్చేస్తుందని అంటున్నారు.

SHARE