ఈనెల 29న వనం -మనంలో భాగంగా కోటి మొక్కుల నాటుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం 4600 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా రూపొందించాలని సూచించారు. నాటిన ప్రతిమొక్కను జియో ట్యాగింగ్ చేసి సంరక్షించాలని బాబు తెలిపారు. ప్లాంటేషన్, పంట సంజీవిని కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు. జిల్లాల మధ్య, శాఖల మధ్య సమన్వయలోపం ఉండొద్దని, నరేగా కింద నీరు-చెట్టు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.