Posted [relativedate]
ప్రధాన మంత్రి మోడీ దూకుడికి కళ్లెం వేస్తున్నారా .! వేస్తె ఎవరా కళ్లెం వేసే వాళ్ళు.?.స్వపక్షమా, విపక్షమా ఎవరు ..నల్లధనాన్ని అరికట్టే దిశలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఉన్నట్టుండి పిడుగులాంటి వార్తను చెప్పిన మోడీ ..మొదట్లో అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చినా ప్రస్తుతం ఎందుకో డిఫన్స్ లో పడినట్టే కనిపిస్తోంది..శీతాకాల సమావేశాలు మొదలైన రెండో రోజు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నల్ల కుబేరులు బాగానే వున్నారు , సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు సభలో ప్రశ్నలు లేవనెత్తుతూ మోడీ దీని మీద వివరణ ఇవ్వాలని నిర్ణయం ఏకపక్షం గా ఉందని దుమ్మెత్తి పోస్తున్నాయి .
కందకి లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న చందం గా .సామాన్య ప్రజలు ఎక్కడ నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు లేవు.హడావుడి అంతా రాజకీయ పార్టీలదే. మార్పు రావాలి అంటే పేద మధ్య ధనిక వర్గాల్లో ఎదో ఒక వర్గం ఖచ్చితం గా ఇబ్బంది పడాల్సిందే, అంతెందుకు రేషన్ కార్డు రద్దు విషయం లో కూడా నష్ట పోయిన బీదలు వున్నారు, నాలుగు చక్రాలు ఉన్న ప్రతిదీ కార్ అంటూ రేషన్ రద్దు చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. అప్పుడు లేని ఉలికిపాటు ఇపుడు దేనికోసం . ఒకటే సమస్య ఇక్కడ ప్రతిపక్షాలు ప్రజలకోసం ఉద్యమం అనే ముసుగులో తమ అనునూయుల పనిని చక్కపెడుతున్నాయా? అసలు సామాన్యుడి దగ్గర బ్లాక్ చేసే అంత సొమ్మే ఉంటే ఇన్ని రాయతీలు ఈదేశం లో ఉంటాయా , బ్లాక్ చేసే సామర్ధ్యం ఉన్న వారే ఎలాంటి ల్ని పోనీ ఆందోళనలు చేయించాలి లేదా , రాజకీయ పార్టీలు మను గడ కోసం ఇలాంటి అంశాన్ని భుజానికి ఎత్తుకోవాలి.
యెంత మనుగడ కోసం ఐనప్పటికీ నైతిక విలువల్ని నిలబెట్టాల్సిన పార్టీలు ఇలాంటి నీతి మాలిన రాజకీయం దిగటం సిగ్గు చేటు , వ్యవస్థ లో అన్ని తప్పులు ఉండవ్ అన్ని ఒప్పులు ఉండవు, బాధ్యత కలిగిన రాజకీయ ప్రజా ప్రతినిధులుగా సూచనలు ఇవ్వాల్సింది పోయి ఇలా చౌక బారుగా వ్యవహరించటం సిగ్గు చేటు.
ప్రధాని మోడీ విషయానికొస్తే ఇలాంటి సమయం లో అయన వెన్నంటి ప్రోత్స హించాల్సిన భీష్ముడు లాంటి బీజేపీ సూపర్ సీనియర్ నేత లీక్ అద్వానీ వంటి వారు కూడా నిర్ణయం తీసుకున్నాక మాకు చెప్పేది ఏముంది అనే లా వ్యవహరించటం ఒకింత బాధాకరం.నిర్ణయం మంచిది ఐనప్పుడు ముందు వెనుక, పెద్ద చిన్న తో సంబంధం ఏముంది తమ్ముడు తనవాడు ఐనా ధర్మం తప్పద్దు అని చెప్పిన వాడు పరమాత్మే కదా .. ఇపుడు స్వపక్షాల్ని నాకు మద్దతు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి మోడీ లాంటి వ్యక్తులకి రావడం నిజం గా బాధపడాల్సిన విషయం,ఎవడో ఒకడు ముందుకి వస్తే తప్ప కదలని ఈ జనం కోసం పనిచేసే మోడీ లాంటి వారికి ఇలాంటి పరిస్థితి రావడం బట్టి చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి .