కాసుల ఆట..

pokeman game1

జపాన్ గేమ్ మేకింగ్ కంపెనీ అయిన నింటెండో షేరు ధర గడచిన 15 రోజుల్లోనే ఏకంగా రెట్టింపైపోయింది. అలాగని ఇదేమీ చిన్నాచితకా షేరు కాదు. జూలై 6న నింటెండో గేమ్ విడుదలయ్యే నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లుగా ఉంది. నిన్న ఒక్కరోజే టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ షేరు ధర 14 శాతం పెరగటంతో దీని మార్కెట్ విలువ ఏకంగా 42 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2.85 లక్షల కోట్లన్నమాట.

టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడైన మొత్తం షేర్లలో నాలుగోవంతు నింటెండో కంపెనీవే. అంటే చేతులు మారిన ప్రతి నాలుగు షేర్లలో ఒకటి నింటెండో షేర్ కావడం విశేషం.నింటెండోతో కలసి గూగుల్ మ్యాప్స్‌ను వినియోగిస్తూ నియాంటిక్ సంస్థ రూపొందించిన పోకెమాన్ గో స్మార్ట్ ఫోన్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన లభిస్తోంది. కొన్నేళ్లుగా కష్టాల్లో ఉన్న నింటెండో కంపెనీకి ఈ పోకెమాన్ గేమ్ కారణంగా తాత్కాలికంగా ఊరట లభించిందని నిపుణులంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here