పోలవరం చరిత్ర…

0
647
polavaram history

Posted [relativedate]

polavaram historyగోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది 70 ఏళ్ల నాటి కల. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం.. దశాబ్ధాల తరబడి కాగితాలకే పరిమితమైపోయింది. బహుళ ప్రయోజనకారి అయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపేశారు మన పాలకులు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుందని తెలుసు. అయినా.. సంకల్పం లేకపోవడంతో కార్యరూపం దాల్చడానికి ఇన్నాళ్లు పట్టింది. మన రాష్ట్రాన్ని ఏలిన పాలకుల్లో.. రాష్ట్ర ప్రయోజనాల్ని కాంక్షించే నేతల్లో.. ఏ పనైనా చేపడితే.. అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టని సంకల్ప బలం కలిగిన నాయకుల్లో ప్రథముడిగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రయోజనకారి అయిన ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనన్న సంకల్పాన్ని చేపట్టిన చంద్రబాబు.. అత్యంత పట్టుదల, కార్యదీక్షతో ముందుకు కదిలారు. తనతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తనతో వచ్చేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించడంలోనూ, నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలోనూ చంద్రబాబు సాధించిన విజయం అసామాన్యమైనది. కేంద్రంతో పోరాడి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తెప్పించడంలోనే చంద్రబాబు సగం విజయం సాధించారు. ఏడు దశాబ్దాలుగా గత పాలకులు చేయలేని పనిని చేసి చూపించారు. ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మహర్దశ ప్రారంభం కావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రెండేళ్ల కృషి మూలాధారమైంది. 70 ఏళ్లుగా నానుస్తూ ప్రజల వద్ద మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాల వైఫల్యాల నేపథ్యంలో చంద్రబాబు 5 కోట్ల ఆంధ్ర ప్రజల కల సాకారానికి ఊతమిచ్చారు. 2018 కల్లా దీనిని పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి కేంద్ర సహకారం లభించింది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరే దిశగా పోలవరానికి నాబార్డు ఋణంతో తోడ్పాటు లభించింది. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా పొందిన దీనికి ప్రస్తుతం సుమారు రూ.2వేల కోట్లు రుణం నాబార్డు ద్వారా అండడంతో సకాలంలో పోలవరం మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు. అందులో ప్రధానంగా కాంక్రీట్ పనులకు డిసెంబరు 30న నాంది పలుకుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో 80లక్షల హెక్టార్ల అదనపు ఆయకట్టుకు నీరు అందిమార్చడానికి ఆస్కారం ఏర్పడనుంది. నదుల అనుసంధానం ద్వారా అపార భగీరదుడనిపించుకున్న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించి `ఆధునిక కాటన్’గా చిరస్మరణీయులు కానున్నారు.

వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన పోలవరం ప్రాజెక్టును ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ చెయ్యాలనుకున్నా ఏళ్ల తరబడి సాగుతూ పోతుంది. ఇలాంటి సందర్భంలోనే కేంద్రంతో దోస్తీ చేయడం ద్వారా.. రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలు కొంత ఆలస్యమవుతున్నా.. భరిస్తూ వచ్చింది ప్రభుత్వం. పోలవరం లాంటి ప్రాధాన్యతతో కూడిన ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మాత్రం కేంద్రం ఉదాసీన వైఖరి వహించకుండా.. ఎప్పటికప్పుడు వెంటపడుతూ.. అనుమతుల విషయంలోనూ, నిధుల విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, అధికార యంత్రాంగం చేసిన భగీరధ ప్రయత్నం మాత్రం నిరుపమానం. ఆనకట్టలు నిర్మించి.. బ్రిటీష్ పాలకుడైన సర్ అర్ధర్ కాటన్.. రాష్ట్ర ప్రజల దృష్టిలో దేవుడైతే.. పోలవరం లాంటి బహుళార్ధకసాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అంతకన్నా ఎక్కువే అవుతారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చాలా మంది రాజకీయాల్లో అడుగుపెడతారు.. నాయకులవుతారు.. పదవులు చేపడతారు.. కానీ ప్రజలకు గుర్తుండిపోయే పనులు.. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన పనులు చేసేవాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పోలవరం పూర్తి చేయాలనుకుంటున్న చంద్రబాబు.. ఎప్పటికి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగానే ఉండిపోతారు.

పోలవరం ప్రత్యేకతలు :

గరిష్ట నీటి మట్టము : + 45.72 మీటర్లు (+ 150.00 అడుగులు)
కనీస నీటి మట్టము : + 41.15 మీటర్లు (+135.00 అడుగులు)
క్రెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిల్ వే : + 25.72 మీటర్లు (+84.39 అడుగులు)
ఈసీఆర్ఎఫ్ డ్యాం టాప్ బండ్ లెవెల్ : + 54.00 మీటర్లు (+177.16 అడుగులు)
గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వాయర్ : 194.60 టీఎంసి
లైవ్ స్టోరేజ్ : 75.20 టీఎంసి
ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ డిశ్చార్జ్ : 50 లక్షల క్యూసెక్కులు
క్యాచ్ మెంట్ ఏరియా : 3,06,643 చ.కి.మీ
సబ్ మెర్జెన్స్ ఏరియా : 601 చ.కి.మీ
ఆర్ అండ్ ఆర్ రిహాబిలిటేషన్స్ : 371

చరిత్ర :

• పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదన 1941లో వచ్చింది.
• 1942 – 44 సంవత్సరాల్లో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు.
• 208 అడుగుల గరిష్ట నీటిమట్టంతో పాటు, 836.35 టీఎంసీల నీటిని నిల్వ ఉంచొచ్చని అప్పట్లో నిర్ధారించారు

• పోలవరం నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధ్యయనం చేసేందుకు.. డాక్టర్ జె.ఎల్.సాల్వేజ్ (రిటైర్డ్ చీఫ్ డిజైన్స్ ఇంజినీర్ ఆఫ్ యుఎస్ బిఆర్, డెన్వర్) నేతృత్వంలోని కొందరు ఇంజినీరింగ్ నిపుణులతో ఓ బోర్డును ఏర్పాటు చేశారు.
• పోలవరం ప్రాజెక్టుకు తొలుత రామపాద సాగర ప్రాజెక్ట్ గా నామకరణం చేశారు.
• పోలవరం ప్రాజెక్టు గరిష్ట, కనీస నీటి మట్టం +150 అడుగుల వరకు ఉండొచ్చంటూ గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది.
• 2004 – 05లో పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన డ్యాంతో పాటు కాలువ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
• ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. భారత ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది.
• పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు 2015 జనవరి 9న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు.
• 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం నాబార్డు నిధులతో కేంద్రమే భరించనున్నట్టు ప్రకటన

పోలవరంతో లాభాలు :

• 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
• గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీటి మళ్లింపు
• 2.91 లక్షల హెక్టార్లు (7.2 లక్షల ఎకరాలు)కు సాగునీరు అందించొచ్చు
• విశాఖ నగరవాసుల తాగునీటి కోసం 23.44 టీఎంసీల కేటాయింపు
• 540 గ్రామాలు (28.5 లక్షల మంది ప్రజలకు) తాగునీటి సౌకర్యం • చేపల పెంపకం, పడవలతో రవాణా మార్గానికి అవకాశాలు
• ఒడీషా, చత్తీస్ ఘడ్ లకు 5 టీఎంసీలు, 1.5 టీఎంసీల నీటి సరఫరా

అనుమతులు :

• పర్యావరణ అనుమతి (2005 అక్టోబర్)
• కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నుంచి ఆర్ అండ్ ఆర్ అనుమతులు (2007 ఏప్రిల్ _ మే)
• అటవీశాఖ అనుమతి (స్టేజ్ 1 : 2008 డిసెంబర్) (స్టేజ్ 2 : 2010 జులై)
• 2010 – 11 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అంచనా రూ. 16,010.45 కోట్లు
• తాజా అంచనాలు ప్రకటించాల్సి ఉంది

ప్రాజెక్టు ప్రధాన పనులు :

• స్పిల్ వే : 1128.4 మీటర్ల కాంక్రీట్ స్పిల్ వే నిర్మించి.. 16 X 20 మీటర్లతో రేడియల్ గేట్లు ఏర్పాటు
• డయాఫ్రం వాల్ : 15 మీటర్ల వెడల్పు, 2454 అడుగుల ఎత్తు గల డయాఫ్రం గోడ నిర్మించడంతో పాటు, డ్యాం ముందు భాగంలో 1.5 మీటర్ల మందంతో 40 నుంచి 100 మీటర్ల రివర్ బెడ్ నిర్మించాలి.
• హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్ : 12 కెప్లాన్ టర్బైన్స్ తో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల కేంద్రం నిర్మాణం
• కుడి, ఎడమ కాలువలకు నీరు ప్రవహించేలా రిజర్వాయర్ నుంచి గట్ల నిర్మాణం
• కుడి కాలువ : 174 కిలోమీటర్ పొడవైన ఈ కాలువ ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇదే కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తారు
• ఎడమ కాలువ : 181.5 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఎడమ కాలువ ద్వారా.. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు.

ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి :

• స్పిల్ వే : ఎర్త్ వర్క్ 90 శాతం పూర్తయింది. 161.50 లక్షల క్యూబిక్ మీటర్లకు గానూ.. 143.81 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పూర్తి చేశారు.
• ఈ ఏడాది డిసెంబర్ 19 నుంచి పనులు చేపట్టి.. 17 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేయాలని నిర్ణయించారు.
• 22 వేల మెట్రిక్ టన్నుల రేడియల్ గేట్లు ఏర్పాటు
• స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్ కు సంబంధించి… మట్టి తవ్వకం పనులు ఇప్పటి వరకు 32.65 శాతం పూర్తయ్యాయి. 776.13 లక్షల క్యూబిక్ మీటర్లకు గానూ, 253.44 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పని పూర్తయింది.
• కాఫర్ డ్యాం పనులు మొదలయ్యాయి.
• 2017 జనవరి నుంచి లక్షా 20 వేల క్యూబిక్ మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణపు పనులు చేపడతారు.
• పవర్ హౌస్ కు సంబంధించి.. 68 శాతం మట్టి తవ్వకం పని పూర్తయింది. 118 లక్షల క్యూబిక్ మీటర్లకు గానూ, 80.31 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పూర్తి చేశారు.
• కుడి కాలువ నిర్మాణానికి సంబంధించి 85 శాతం పనులు పూర్తయ్యాయి.
• ఎడమ కాలువ నిర్మాణానికి సంబంధించి 61 శాతం పనులు పూర్తయ్యాయి.

Leave a Reply