వర్మపై కేసు నమోదు

0
567
police case files on ram gopal varma

Posted [relativedate]

police case files on ram gopal varmaవివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవ్వడం క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కొత్తేది కాదన్న విషయం తెలిసిందే. నిన్న మహిళా దినతోత్సవం సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మహిళలకు శుభాకాంక్షలను తెలుపుతూ, బాలీవుడ్‌ శృంగార తార సన్నిలియోన్‌ తో పోలుస్తూ వర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చీప్ పబ్లిసిటీ కోసం వర్మ ఆడవాళ్లపై అభ్యంతరకమైన కామెంట్లు చేశాడని అంటున్నాయి. దీనిపై గోవాలో విశాఖ మాంభ్రే అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ ట్విట్టర్ ఎకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని పోలీసులను కోరారు. దీంతో మాంబ్రె పోలీసులు కేసు నమోదు చేశారు. 

అయితే వర్మ  ఈ ట్వీట్ల విషయంలో ఏ మాత్రం  వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. సన్నీలియోన్‌ నిజాయతీ పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తపరచాన్నాడు వర్మ. నిజంగా మిగతా మహిళాలు కంటే సన్నీలియోన్ ఎంతో నిజాయితీగా ఉటుందని, తన వ్యాఖ్యలు అర్ధం కాని మూర్ఖులే ఇలా విమర్శలు చేస్తారని ఫైర్ అయ్యాడు వర్మ.

కాగా తాను చేసే ప్రతి వివాదాస్పద ట్వీట్ ని ఏదో రకంగా సమర్ధించుకునే వర్మని మార్చాలనుకోవడం మన ఖర్మఅని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

ram gopal varma, ram gopal varma women's day, rgv women's day, ram gopal varma police complaint, ram gopal varma sunny leone, ram gopal varma sunny leone tweet, ram gopal varma women's day sunny leone, ram gopal varma complaint, ram gopal varma news, ram gopal varma controversy, ram gopal varma women's day controversy, bollywood news, entertainment updates, indian express, indian express news, indian express entertainment

Leave a Reply