Posted [relativedate]
భల్లాలదేవ (రానా దగ్గుపాటి), ప్రకాష్ రాజ్ లపై పోలీస్ కేసు నమోదైంది. ఈ మధ్య బుల్లితెరపై ఓ రమ్మీ యాడ్ తెగ హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే….ఈ యాడ్ లో రానా, ప్రకాష్ రాజ్ లు కలసి రమ్మీ ఆడాలని పోత్సహిస్తున్నారు. సినీ స్టార్ ప్రమోషన్ రమ్మీకి ఇంకా ఆదరణ పెరుగుతోంది.తాజాగా, ఈ యాడ్ లో నటించిన రానా, ప్రకాష్ రాజ్ లపై కోయంబత్తూరుకు చెందిన ఓ సోషల్ యాక్టవిస్ట్ పి.ఇళగోవన్ కేసు పెట్టాడు.
వీరిద్దరూ రమ్మీ ఆడాలని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.వెబ్ సైట్ల ద్వారా గ్యాంబ్లింగ్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు అంటూ కోయంబత్తూరు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కేసుని నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.మరోవైపు, ఈ ఇద్దరు సినీ స్టార్స్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మన ఊరి రామాయణం’ హిట్ కొట్టాడు ప్రకాష్ రాజ్.బాహుబలి 2 షూటింగ్ ని పూర్తి చేసుకొన్న రానా బాలీవుడ్ చిత్రం ‘ఘాజీ’ తో పాటుగా.. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు.