ఇది చదివితే నేడు పోలీస్ లకి సెల్యూట్ చేయకుండా ఉండలేరు..

 Posted October 21, 2016

police commemoration dayప్రతి ఏడాది అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తాం..అదే రోజు ఎందుకు పాటిస్తామో తెలుసా? తెలిస్తే దీన్నో సాదాసీదా తంతుగా తీసుకోలేము.మన కోసం ప్రాణాలకి తెగించి మరీ పోరాడుతూ అసువులు బాసిన వారికి నిండు మనస్సుతో అంజలి ఘటిస్తాం.. భారత్ .. చైనా సరిహద్దులో అక్సాయ్ చిన్ ప్రాంతం వుంది ..16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డ కట్టే మంచు పర్వతాల మధ్య వున్న ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రతా విధులు నిర్వహించడం ప్రాణాలతో చెలగాటమే..శత్రువులే కాదు ప్రకృతి కూడా అనుక్షణం ప్రాణాలు మింగే యమదూతలా ఉంటుంది.భారత్..చైనా సరిహద్దులోని లడఖ్,సియాచిన్ భద్రతాపరంగా కీలకం.సరిహద్దు భద్రతా దళం,ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఇంకా అప్పటికి ఏర్పాటు కాలేదు.కేంద్ర రిజర్వు పోలీస్ దళం crpf అక్కడ అక్కడ విధులు నిర్వహించేది.

india-chine-locఅది 1959..అక్టోబర్ 21 న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో 21 మంది సభ్యుల crpf బృందం సియాచిన్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు.ఆ సమయంలో చైనా బలగాలు సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నించాయి.పైన మనం చెప్పుకున్న అక్సాయ్ చిన్ దగ్గర వున్న ఓ వేడి నీటి బుగ్గ దగ్గర crpf దళం చైనా సైనికులతో తలపడింది.ఆ పోరాటంలో పదిమంది జవాన్లు వీరమరణం పొందారు.అక్కడి వేడి నీటి బుగ్గ వీరుల రక్తాన్ని తనలో కలుపుకుంది.ఆ బుగ్గ దగ్గర ప్రతి ఏటా అక్టోబర్ 21 న అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఆ స్థలాన్ని సందర్శించి అమర జవాన్లకు అంజలి ఘటిస్తారు.వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకే ప్రతి ఏటా అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తారు.

SHARE