ఏ ఓ బి మరువక ముందే మావోయిస్టులకు మరో దెబ్బ…

Posted November 17, 2016

polices encounter 6 Maoists killed and 2 held in Dantewadaమావోయిస్టు లకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఏ ఓ బీ ఎన్కౌంటర్ దాడి మరువక ముందే మరో ఎదురు దెబ్బ తగిలింది.ఛతీస్ ఘడ్ దంతెవాడ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది .బూర్గం సమీపం లో పోలీస్ లకు మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు .ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే జిల్లా రిజర్వ్‌ పోలీసు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు గోండ్‌పల్లి అడవుల్లో ఆపరేషన్‌ నిర్వహించాయని బస్తర్‌ రేంజ్‌ ఐజీ ఎస్సార్పీ కల్లూరి చెప్పారు.

మంగళవారం రాత్రి ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిందని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో బలగాలు ఎదురుకాల్పులు చేశాయన్నారు. సాయంత్రానికి మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. ఘటనాస్థలి నుంచి ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించామని, వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారని మరో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్‌ చేశామన్నారు.

ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైఫిల్స్ తో పాటు పేలుడు పదార్థాలు, తొమ్మిది కిట్ బ్యాగ్లు స్వాధీనం చేసుకున్నారు .

SHARE