పల్నాటి పుంజులకి కళ్లెమేసిన ఖాకీలు ..

 polices house arrest tdp mla yarapathineni srinivasa rao ycp mla pinnelli ramakrishna reddy
పౌరుషాల పుట్టినిల్లు పల్నాటి పోరుగడ్డలో ఉద్రిక్తతలకు కారణమైన రెండు రాజకీయ పుంజులకి ఖాకీలు కళ్లెమేసారు.ఆ పుంజుల్లో ఒకరు అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ..మరొకరు వైసీపీ Mla పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.టీడీపీ అధికారంలోకి వచ్చాక యరపతినేని అక్రమాలు పెచ్చుమీరాయని …వాటిని నడికుడి లో బహిరంగం చేస్తానని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.

దానికి యరపతినేని కూడా సై అన్నారు .దీంతో ఒక్కసారిగా పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఇంతలో వాళ్ళు నడికుడి మార్కెట్ యార్డ్ కేంద్రంగా తలపెట్టిన బహిరంగ చర్చ డేట్ August 29 వచ్చేసింది.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు .ఈ తెల్లవారుజాము నుంచే పరిస్థితి చక్కదిద్దే చర్యలు చేపట్టారు.సభాస్థలికి వెళ్లకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని..హౌస్ అరెస్ట్ చేశారు.మాచర్ల,పిడుగురాళ్ల ,దాచేపల్లి ప్రాంతాల్లో దూకుడుగా వ్యవరించే ఆస్కారమున్న రెండు పార్టీల నేతల్ని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.ఇక దేశం ఎమ్మెల్యే యరపతినేనిని కూడా పిడుగురాళ్లలో హౌస్ అరెస్ట్ చేశారు.ఈ ముందస్తు అరెస్టుల కోసం పోలీసులు వినాయకచవితి ఆంక్షల్ని వాడుకోవం ఆసక్తి రేకెత్తించింది.పోలీసులు తల్చుకుంటే దేవుడినైనా వాడుకోగలరని అర్ధమైంది .

Leave a Reply