రాజకీయ అయస్కాంతానికి బ్రేక్?

0
462

no-jumping-politicions

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అయస్కాంతం దగ్గరికి ఎవరూ రాకుండా మోడీ సర్కార్ అడ్డంపడుతోందా? ప్రస్తుతానికి ఇది నిజమే. నిన్న మొన్నటి దాకా ఇద్దరు ముఖ్యమంత్రులు నియోజకవర్గాల పెంపు, పునర్విభజన ఆశ చూపి ప్రత్యర్థి పార్టీల నేతల్ని అయస్కాంతంలా ఆకర్షించారు. ఈ ప్రవాహాన్ని ఆపడానికి ఇటు తెలంగాణ … అటు ఆంధ్రాలో విపక్షాలు నానాకష్టాలు పడాల్సివచ్చింది. ఇపుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చే సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. నియోజక వర్గాల పెంపు 2019 లోపు సాధ్యం కాదని మోడీ సర్కార్ పార్లమెంట్ లో ప్రకటించడంతో అధికార పక్ష అయస్కాంతానికి ఆకర్షితులవుతున్న నేతల దూకుడుకు బ్రేక్ పడింది.

ఇది ఒక్కటి మాత్రమే కారణం కాదు. రెండు ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్లు దాటింది. ప్రజాసమస్యలు బయటికొస్తున్నాయి. ప్రభుత్వాల మీద ఇపుడిపుడే ఎంతో కొంత వ్యతిరేకత మొదలవుతోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల వివాదం, ప్రత్యేక హోదా ఉద్యమం … రెండిట్లోనూ ప్రజా స్పందన బాగా కన్పిస్తోంది. దీంతో విపక్ష నేతలు కొన్నాళ్లు వేచిచూద్దాం అనుకొంటున్నారు.

Leave a Reply