కిరణ్ కి జగన్ పిలుపు? భలే పొలిటికల్ ట్విస్టు..

0
1374

Posted [relativedate]

political twist jagan calling kiran kumar
ఏపీ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన లో చేరేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెడీ అయిపోయారన్న ప్రచారం జోరందుకున్న తరుణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్టు సమాచారం. ఊహించని విధంగా కిరణ్ కి జగన్ తరపున వైసీపీ నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది.దీంతో ఆశ్చర్యపోవడం కిరణ్ వంతు అయిందట.దానికి కారణం లేకపోలేదు….

ఫ్లాష్ బ్యాక్ కి వెళితే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ని సీఎం చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.అప్పట్లో ఈ నిర్ణయం మీద వైసీపీ అధినేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.వై.ఎస్ ముఖ్య అనుచరుల్లో ఒకడైన కిరణ్ పొడ కూడా జగన్ కి గిట్టలేదు.ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే.ఇప్పుడు పవన్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ కిరణ్ కూడా జనసేనలో చేరితే ఎదురయ్యే పరిణామాల్ని అంచనా వేసుకుంది.దీంతో ఓ మెట్టు దిగిన జగన్ ముఖ్యులతో కిరణ్ కి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది.దానికి ఆశ్చర్యపోయిన కిరణ్ ఆలోచించుకుని చెప్తానన్న మాటతో అప్పటికి సరిపుచ్చారట. దీంతో జగన్..పవన్ ..మధ్యలో కిరణ్ అనే కధ సరికొత్త పొలిటికల్ ట్విస్ట్ తీసుకుంది. ఏదేమైనా ఈ నెల 23 లోపే కిరణ్ సరికొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply