మోదీ సినిమా అయినా సర్టిఫికేట్ ఇవ్వలేం:  బోర్డు

Posted [relativedate]

censor board not giving to certificate from modi ka gaon movieఏ సినిమాకైనా సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికేటే మూలం. వాళ్లు సర్టిఫికేట్ ఇవ్వకుంటే సినిమా విడుదల జరగదు. అటువంటి సెన్సార్ బోర్డు ఓ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసేందుకు మాత్రం నో చెప్పింది. అది మోదీ సినిమా అయినా సర్టిఫికేట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ చిత్ర నిర్మాత  సెన్సార్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ జీవితంలోని కీలక అంశాల ఆధారంగా ‘మోదీ కా గావ్’ సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. తుషార్ ఏ గోయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్  ఝా నిర్మించారు. కాగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని, సర్టిఫికేట్ ని ఇవ్వలేమని  సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. అలాగే చిత్రంలో  పప్పు బీహారీ అనే పదాన్ని, ఓ పాటను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది.

అయితే తన సినిమా విడుదల కాకుండా కావాలనే సెన్సార్ బోర్డు మెలిక పెట్టిందని, అవసరమైతే కోర్టుకు వెళతానని చిత్ర నిర్మాత ఝా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నుండి NOC తెచ్చుకోమని బోర్డు చెబుతోందని, తాను NOC తెచ్చుకుంటే సెన్సార్ బోర్డు ఎందుకని నిర్మాత ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై అటు సెన్సార్ బోర్డు, ఇటు చిత్ర యూనిట్  ఏం చేయనుందో చూడాలి.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీ అయ్యారా?

Posted [relativedate]

sasikala shifted aiadmk mlas to secret place
తమిళనాట రాజకీయ సంక్షోభం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే చిన్నమ్మ వైపే ఉండాలా ..లేక సెల్వాన్ని నమ్ముకోవాలా?అని వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.సరే చిన్నమ్మ పిలిచింది కదా ..ఆ సమావేశానికి వెళ్లి ఆమె ఏమి చెబుతుందో విన్నాక నిర్ణయం తీసుకుందామని చాలా మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు.అలాగే శశికళ తో సమావేశమయ్యారు.కానీ తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు.ఈ సంక్షోభం ముగిసేదాకా ఓ క్యాంపు నిర్వహిద్దామని మీటింగ్ లో రొటీన్ గా ఓ మాట అన్నారు శశికళ వీరవిధేయులు.సరే ..ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే ..బయటికి రాగానే వారి చేతుల్లో ఫోన్లు లాగేసుకున్నారు శశి అనుచరులు.అదేమంటే అన్నాడీఎంకే చీలిక నివారణ,జయ ఆశయాల సాధన అంటూ వారి నోరు మూయించారు.బయటికి రాగానే వారిని బస్సుల్లో ఎక్కించి రహస్య ప్రదేశాలకి తీసుకెళ్లారు.

శశికళ క్యాంపు లో వున్న ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.అటు కేంద్రం అండ లేకుండా ఈ క్యాంపు లో ఎన్నాళ్ళు బందీలుగా ఉండాలో అని వారి బాధ.ఈ విషయమే అడిగితే క్యాంపు నిర్వాహకులు నోరు మెదపడం లేదంట.దీంతో రాజకీయ భవిష్యత్ సంగతి తర్వాత,ఈ బందీ ఖానా నుంచి ఎంత త్వరగా బయటపడితే అదే చాలని భావిస్తున్నారు ఎమ్మెల్యేలు.

కాటమరాయుడు ఇంట్రడక్షన్ సాంగ్ లీక్..?

Posted [relativedate]

pawan kalyan katamarayudu movie introduction song leakedప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కాటమరాయుడు సినిమా. ఇప్పటివరకు కేవలం పోస్టర్లతోనే  సర్దుకున్న పవన్ అభిమానులు రీసెంట్ గా విడుదలైన టీజర్ తో పండగ చేసుకుంటున్నారు. కేవలం 57 ఏడు గంటల్లో 5 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ఇక అసలు విషయానికొస్తే ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్ట్రన్ బీట్ తో ఉన్న ఆ పాట పవన్ మునపటి సినిమాల్లాల్లోని పాటలానే   ఉండడంతో అభిమానులు విని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా సినిమాలోని పవన్ క్యారక్టర్ ని కొట్టచ్చేట్టు చూపించిన ఈ పాట నిజంగా సినిమాకు సంబంధించినది కాదని, కొంతమంది అభిమానులు సరదాగా చేసిన పాటని కొందరు కొట్టిపారేస్తున్నారు.

ఇటీవల కాలంలో కొందరు దర్శకనిర్మాతలు సినిమాలోని  కొన్ని కీలక సన్నివేశాలను, హీరో ఇంట్రడక్షన్ సీన్లను  ముందుగా తామే రిలిజ్ చేసి , తమ సినిమాల్లో సీన్లు లీకైపోయాయంటూ హడావుడి చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారని కొందరు సినీ విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో లీకైదంటూ హల్ చల్ చేస్తున్న పవన్  పాట కూడా అదే మాదిరి ప్రమోషన్ అంటున్నారు. ఏది ఏమైనా ఈ పాట గురించి దర్శకనిర్మాతలు స్పందించేవరకు ఎవరికి తోచింది వారు వెల్లడిస్తూనే ఉంటారు.

వావ్.. అనిపిస్తున్న “మెగా150 గేమ్”

Posted [relativedate]

Mega 150 Game Trailer
టెంపుల్ రన్ అనే వీడియో గేమ్ ని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు ఆడుతుంటారు. ఈ గేమ్ ఆడుతుంటే చాలు .. చిన్నపిల్లలు చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోతారు. అంతలా ఆకట్టుకుంది ఈ టెంపుల్ రన్ గేమ్. కాగా ఈ టెంపుల్ రన్ మాదిరిగా మన మెగాస్టార్ చిరు కూడా మెగా 150 గేమ్ పేరుతో గేమ్స్ అభిమానులను అలరించనున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం… ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంలో ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ అనే కంపెనీ మెగా 150 గేమ్ ను ప్లాన్ రూపొందించింది. చిరంజీవి నటించిన 150 సినిమాలతో ఈ గేమ్ ను తయారు చేయడం విశేషం. ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ ప్రతినిధులు సతీష్ బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి ఈ గేమ్ ను రూపొందించారు. టెంపుల్ రన్ మాదిరిగా డిజైన్ చేసిన ఈ గేమ్ లో మెగాస్టార్ చేసిన సినిమాలకు అనుగుణంగా కేరక్టర్ ను మార్చడం, లొకేషన్స్ ఛేంజ్ చేయడం, టార్గెట్ లను, ఎదురయ్యే సవాళ్లను తీర్చిదిద్దారు.

14 లెవల్స్ లో ఉండే ఈ మొత్తం గేమ్ ను రెండు వాల్యూమ్స్లో విడుదల చేస్తున్నారు. మొదటి వాల్యూమ్ లో 110 సినిమాలతో గేమ్ ఉంటే, రెండో వాల్యూమ్లో 40 సినిమాలతో గేమ్ ను రూప కల్పన చేశారు. మరి ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ రూపొందించిన ఈ గేమ్… వీడియో గేమ్ లవర్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ కింద్ర ఉన్న వీడియోలో ఆ గేమ్ ని చూసి మీరు ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=HppiS_yqKGQ

వైసీపీ కి బెల్లం పెట్టిన లగడపాటి..

Posted [relativedate]

lagadapati rajagopal says sweet news to ycp and bjp
ఎన్నికల ఫలితాలని అంచనా వేయడంలో రాటుదేలిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం మీద తన అభిప్రాయాలు వెల్లడించారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ బోల్తా కొడుతుందని ఆ పార్టీ నేతలకి కోపం తెప్పించిన ఆయన ఈసారి మాత్రం వారి నోట్లో బెల్లం ముక్క పెట్టినంత తియ్యటి కబురు చెప్పారు.ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందని లగడపాటి అభిప్రాయపడ్డారు.గ్రామీణ ప్రాంతాల్లోగతంతో పోల్చుకుంటే వైసీపీ బలం పెరిగిందని ,పట్టణ ప్రాంతాల్లో టీడీపీ,వైసీపీ పోటాపోటీగా ఉన్నాయని లగడపాటి చెప్పారు.పట్టణాలు,నగరాల్లో వైసీపీ ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి బీజేపీ గెలుపు సాధిస్తుందని రాజగోపాల్ వివరించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం బీజేపీ కి ఉపయోగకరంగా మారిందని ,అదే సమయంలో ఇంట్లో కుంపటి పెట్టుకుని సమాజ్ వాది పార్టీ వెనుకబడిందని లగడపాటి చెబుతున్నారు.చూద్దాం!

“కిట్టు ఉన్నాడు జాగ్రత్త” ట్రైలర్ రిలీజ్

Posted [relativedate]

kittu unnadu jagratha movie trailer releasedప్రస్తతం టాలీవుడ్ లో మంచి జోష్ తో యాక్ట్ చేసే హీరోల్లో రాజ్ తరుణ్ పేరు ముందుంటుంది. డైలాగ్ డెలివరీలో కాస్త పల్లెటూరి స్లాంగ్ ని మిక్స్ చేస్తూ  అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకోగల సత్తా ఉన్న నటుడు ఈ యంగ్ హీరో. ఉయ్యాల జంపాల, కుమారి 21F, సినిమా చూపిస్తా మామ, ఈడోరకం ఆడోరకం  వంటి సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ కుర్రాడు నటిస్తున్న తాజా చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్త.

ఓ యంగ్ స్టర్ వరుసగా కుక్కల్ని కిడ్నాప్ చేస్తుంటాడని,  అయితే కుక్కల్ని కిడ్నాప్ చేసేది ఓ అమ్మాయి కోసమే అయినా ఆ  కిడ్నాప్ ల వెనుక చాలా మీనింగే ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్ర ట్రైలర్ ని రీలీజ్ చేసిన దర్శకనిర్మాతలు… కుక్కల్ని కిడ్నాప్ చేసేవాడు కాబ‌ట్టి `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`  అనే టైటిల్ అర్ధవంతంగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో కిట్టు గాడిగా రాజ్ తరుణ్ నటిస్తుండగా, అను   ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు తాను నటించిన అన్ని సినిమాలతో హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ కి కిట్టు గాడు ఎటువంటి హిట్ ను అందివ్వనున్నాడో చూడాలి.