పూజ చాక్ పీస్ తినేసింది..

0
626

 pooja hegde eating check pees

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తాజా సినిమా ‘మొహంజొదారో’. ఈ చిత్రంలో కథానాయిక పూజ హెగ్డే నటన, కాన్ఫిడెన్స్ లెవల్స్ కు ఆశ్చర్యపోయినట్లు హృతిక్ ఓ సందర్భంలో చెప్పారు. తొలి హిందీ చిత్రంలోనే ఇంత ఆత్మవిశ్వాసంతో నటించిన అమ్మాయిని చూడలేదని అన్నారు. అయితే.. హృతిక్ తో మాట్లాడేందుకు పూజ తొలుత కాస్త భయపడిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. 12నే విడుదల అవుతున్న ‘మొహంజొదారో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హృతిక్-పూజ. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూజతో తొలుత హృతిక్ మాట్లాడారట. డైట్ ఫుడ్ కోసం చూస్తున్న ఆమెకు ఈ ‘క్రిష్’ స్టార్ ఓ సుద్ద ముక్క ఇచ్చారట. అది నిజంగా డైట్ బార్ అనుకుని పూజ తినేసిందట. హృతిక్ అసలు విషయం చెప్పగానే తెగ నవ్వుకుందట. అలా వీరి ఫ్రెండ్ షిప్ మొదలైందట.

ఇక, పూజ ముంబై వాసి అని హృతిక్ కు తెలియదట. ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్ ల్లోనే సినిమాలు చేయడంతో దక్షిణాది భామ అనుకున్నారట. ఓ రోజు షూటింగ్ లో.. ‘ఇంటికి ఎప్పుడు వెళ్తావు?’ అని ఆయన పూజను అడిగారట. దానికి అమ్మడు సాయంత్రం 6గంటలు అని చెప్పగానే.. ఏ ఫ్లైట్ కు వెళ్తున్నావని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పూజ.. ‘ఫ్లైట్ ఏంటి? నేను బాంద్రాలో ఉంటా.’ అనేసరికి ఆశ్చర్యపోవడం హృతిక్ వంతైందట.

Leave a Reply