పూరి కంపెనీలో ఛార్మీయే.

 poori jagannath puri connects company charmi ceoదర్శకుడు పూరి జగన్ త్వరలోనే ఒక టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టబోతున్నాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఫైనల్ గా ఇప్పుడు ఆ కంపెనీ విశేషాలన్నీ పబ్లిక్ అయ్యాయి. ఈ కంపెనీ పేరు ”పూరి కనెక్ట్స్”(PC). కేవలం మోడళ్ళను – నటీనటులనే కాక దర్శకులు – ఎడిటర్లు – మ్యూజిక్ డైరక్టర్లు, తదితర టెక్నీషియన్ల పోర్టుఫోలియోలు కూడా నిర్వహిస్తారట.

ముంబయ్ కు చెందిన తొయాబా (TOABH) అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలసి హైదరాబాద్ లో ఈ సంస్థను నెలకొల్పుతున్నట్లు పూరి చెప్పాడు. ఈ కంపెనీకి హెడ్‌గా హీరోయిన్ ఛార్మిని నియమించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. దిశా పటానీ – అమైరా దస్తూర్ వంటి సుందరాంగులను తెలుగు తెరకు ఈ కంపెనీ ద్వారానే అనధికారికంగా పరిచయం చేశారు. త్వరలో మరింతమంది బ్యూటీలు ‘పూరి కనెక్ట్స్’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కావచ్చు.

SHARE