వైసీపీ, జ‌న‌సేన‌ల‌కు యూత్ దూరం?

0
510
popularity decrease in youth on jagan and pawan kalyan

Posted [relativedate]

popularity decrease in youth on jagan and pawan kalyan
ఏపీలో బ‌లమైన ప్రతిప‌క్షం వైసీపీ. ఇక గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీకి స‌పోర్ట్ చేసిన పార్టీ జ‌న‌సేన. రెండు పార్టీలకు ఇద్దరు బ‌లమైన నాయ‌కులున్నారు. అటు వైసీపీ అధినేత జ‌గ‌న్ గానీ… ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు గానీ… యూత్ ను ఆక‌ట్టుకోగ‌ల స‌త్తా ఉంది. ఇది గ‌తంలోనూ రుజువైంది. అయితే ఇటీవ‌ల వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన‌ హోదా పోరులో మాత్రం యూత్ దూరంగా ఉండ‌డం ఈ ఇద్దరికి మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది.

ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న వైసీపీ హోదా పోరుకు సంపూర్ణ మ‌ద్దతు ప్రక‌టించింది.వైజాగ్ కు పెద్ద ఎత్తున యూత్ త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చింది. ఆదిశ‌గా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున వ‌స్తార‌ని వైసీపీ నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేశార‌ట‌. కానీ ఒక్క వైజాగ్ లో మిన‌హా ఏ ప‌ట్టణం నుంచి కూడా యువత కదల‌లేదు. వైజాగ్ లోనూ చుట్టు పక్కల ప్రాంతాల యువ‌కుల‌ను కొంత‌మందిని బ‌ల‌వంతంగా స‌మీక‌రించార‌ట‌. అది కూడా రెండు మూడు వేల‌కు దాట‌లేదు. హోదా పోరులో అరెస్టయిన వారిని చూస్తే అది ఈజీగా తెలిసిపోతోంది. జ‌గ‌న్ ఎక్కడైనా యాత్ర చేస్తే… పెద్ద ఎత్తున యూత్ వ‌స్తారు. మ‌రి అలాంటిది వైజాగ్ కు మాత్రం యువ‌త డుమ్మా కొట్టారు. అంటే జ‌గ‌న్ కు యూత్ లో క్రేజ్ త‌గ్గిందా అన్న అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

ఇక జ‌న‌సేనాని ప‌వ‌న్ అయితే ట్విట్టర్ ద్వారా స‌మ‌ర‌మే అంటూ నినాదం చేశారు.కానీ ఆయ‌న పిలుపును కూడా యూత్ లైట్ తీసుకున్నారు . ప‌వ‌న్ ఎన్ని చెప్పినా… డోంట్ కేర్ అంటూ హోదా పోరుకు డుమ్మాకొట్టారు. దీంతో ప‌వ‌న్ కు యూత్ లో ఏమాత్రం ఫాలోయింగ్ ఉందో అర్థమైపోయింద‌న్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్, ప‌వ‌న్ స్వయంగా పిలుపునిచ్చినా యువత రాలేదంటే ఒక్క విష‌యం మాత్రం స్పష్టం. ఇద్దరి మాట‌ల‌ను యూత్ పెద్దగా సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు. అంతేకాదు వారిద్దరూ ఎంచుకున్న స‌బ్జెక్ట్ లో కూడా అంత‌గా బ‌లం లేక‌పోవ‌చ్చు. అంటే హోదా పోరుతో లాభం లేద‌ని యూత్ కు అర్థమైపోయిందా? అందుకే జ‌గ‌న్, పవ‌న్ పిలుపుల‌కు రెస్పాండ్ అవ్వలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందులో ఎంతోకొంత నిజం లేక‌పోలేదని ఇప్పుడు ప్రచారం కూడా జోరుగా జ‌రుగుతోంది మ‌రి!!!

Leave a Reply