స్మూత్ గా పోసాని బండి రైడింగ్..

0
516
posani as anchor for bathuku jatka bandi

Posted [relativedate]

posani as anchor for bathuku jatka bandi
మాట ఎంత కటువో,మనసు అంత మెత్తన ….సినీ రచయిత,నిర్మాత,దర్శకుడు పోసాని కృష్ణమురళి కి ఈ మాట అతికినట్టు సరిపోతుంది.ఆయన మాటలు,ఆవేశం చూసిన వాళ్లంతా ఈయనని జీ టీవీ లో బతుకు జట్కా బండి అనే కార్యక్రమానికి ఎన్నుకోవడం చూసి నోరు వెళ్లబెట్టినవారే.మరో పక్క పోటీ ఛానెల్స్ లో సుమలత,రోజా వంటి సీనియర్ హీరోయిన్స్ ఈ తరహా ప్రోగ్రామ్స్ ని రక్తి కట్టిస్తున్నారు.ఈ విషయంలో జీ టీవీ జీవిత,గీత లాంటి సీనియర్ హీరోయిన్స్ ని ప్రయత్నించి ఇప్పుడు పోసానిని యాంకర్ గా తీసుకున్నారు.ఆ ప్రోగ్రాము నిర్వాహకుల నమ్మకాన్ని పోసాని ఎంతవరకు నిలబెట్టుకున్నారు?

బతుకు జట్కా బండి కార్యక్రమం నిర్వాహకులనే కాదు ప్రేక్షక లోకాన్ని కూడా పోసాని బాగానే ఆకట్టుకున్నారు.ఇన్నాళ్లు టీవీ అనగానే పోసాని ఆవేశం తో రంకెలు వేయడమే చూసిన వాళ్లకి బతుకు జట్కా బండిని స్మూత్ గా రన్ చేయడం కూడా అనుభవంలోకి వచ్చింది.తన యాంకర్ పాత్రకి తోడు మానవత్వం జోడించి ఓ బాధితురాలికి కొంత సాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు పోసాని.ఇలా ఏ విధంగా చూసినా ఆడవాళ్లు మాత్రమే చేయగలరనుకునే షో ని తనదైన స్టైల్ లో రక్తి కట్టించి సీనియర్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతున్న పోసానికి అభినందనలు చెప్పాల్సిందే.

Leave a Reply