పోసానికి అర్ధం కాని పార్టీ..నాయకుడెవరు?

Posted October 3, 2016

posani krishna murali commentsపోసాని కృష్ణ మురళి …ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడగలిగిన వ్యక్తి.మొహమాటాలు,వ్యక్తిగత భేషజాలకు దూరంగా ఎవరి గురించి అయినా మాట్లాడగలిగిన వారిలో ముందువరసలో వుంటారు పోసాని.అలాంటి ఆయనే ఓ పార్టీ,ఓ నాయకుడి మీద మాట్లాడ్డానికి వెనుకాడారు.అయితే దానికి కారణం ఏంటంటే …ఆ పార్టీ,నాయకుడి గురించి అర్ధం కాకపోవడమే .ఇంతకీ ఆ పార్టీ మరేంటో కాదు జనసేన ..ఆ నాయకుడు పవన్ కళ్యాణ్.చాలా మందిలాగానే జనసేన ఏమి చేస్తుందో తనకు కూడా అర్ధం కావడం లేదన్నారు.

ఇక చిరంజీవి ప్రజారాజ్యం గురించి పోసాని సానుకూల దృక్పధంతో మాట్లాడారు.చిరంజీవి నిజాయితీపరుడని చెప్పారు.ఒక్క పైసా తీసుకోకుండా అయన అసెంబ్లీ టికెట్ ఇచ్చినా ఓట్లు కొనడానికి తాను సిద్ధపడకపోవడం వల్లే ఓడిపోయినట్టు వివరించారు.అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినపుడు చిరు మీద మండిపడ్డ పోసాని టోన్ తాజాగా మారిపోయింది.

SHARE