పవర్ స్టార్ కు నేనే పేరు పెట్టా..!

Posani Sensational Hot Comments About Power Star Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కల్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కల్యణ్ గా ఉన్న అతన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా చేసింది నేనే అంటూ సంచలన కామెంట్ చేశాడు నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి. గోకులంలో సీత సినిమాకు కథ అందించిన ఆయన ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ను చూసి ఇతను పవర్ స్టార్ అవుతాడని చెప్పానని ఇప్పుడు అదే విధంగా పవర్ స్టార్ మీ అభిమాన నటుడు అయ్యాడని అన్నారు పోసాని.

ఇక వారసత్వం మీద ఓ రేంజ్ క్లాస్ పీకిన పోసాని ఏ పరిశ్రమలో అయినా వారసులకు ఎంట్రీ దొరుకుంతుంది కాని దాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం వారసులలో కూడా సత్తా ఉండాలని.. ఆ క్రమమలో కె.సి.ఆర్ తనయుడు కె.టి.ఆర్ రాజకీయాల్లో సినిమా పరిశ్రమలో మెగాస్టార్ తనయుడు రాం చరణ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిచారని అన్నారు. ఇక నాయక్ సినిమా కోసం వినాయక్ ఛాన్స్ ఇవ్వబట్టే నటుడిగా తాను బిజీ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకుని వినాయక్ కు సభాముఖంగా మరోసారి థాంక్స్ చెప్పారు.

పవర్ స్టార్ పేరు వినగానే కేకలేసే ఫ్యాన్స్ ను ఉద్దేశించి పవర్ స్టార్ కు ఆ పేరు పెట్టింది నేనే అని సంచలనంగా మాట్లాడారు పోసాని. ఇక ధ్రువ సినిమా విషయానికొస్తే చరణ్ బాగా కష్టపడ్డాడని తనకు ఈ సినిమాలో మంచి రోల్ దొరికిందని సినిమా మంచి విజయం సాధించాలని సాధిస్తుందని అన్నారు.

SHARE