ధ్రువ అప్పుడే వచ్చుంటే..!

Posted December 21, 2016

Postpone Effect On Collections For Dhruva Movie

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే హిట్ టాక్ వచ్చి ఓవర్సీస్ లో 1 మిలియన్ క్రాస్ చేసి ఇంత జోష్ ఫుల్ గా ఉన్నా సరే ఇప్పటి దాకా 40 కోట్ల కలక్షన్స్ రాబట్టిందని అంటున్నారు. అయితే ధ్రువ పక్కా హిట్ కాకపోతే డిమానిటైజేషన్ ప్రభావంతో పాటుగా సినిమా అనుకున్న టైం కన్నా లేట్ అవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు.

ఇక ఈ సినిమా అసలు రిలీజ్ అవ్వాల్సినది దసరాకే.. కాని దసరా సీజన్ చాలా సినిమాలు పోటీ పడుతుండటంతో పోస్ట్ పోన్ చేశారు. అప్పటికల్లా సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా సినిమా ఓ రేంజ్ హిట్ అయ్యి ఉండేది. అంతేకాదు ఇప్పుడు 40 కోట్లని చెబుతున్న కలక్షన్స్ అప్పుడు 60 కోట్లు ఈజీగా రాబట్టుకునేది. చెర్రి పర్ఫార్మెన్స్, రకుల్ అందాలు సురేందర్ రెడ్డి డైరక్షన్ అన్ని కలిసి సినిమాకు మెగా అభిమానులకు పండుగ చేసుకునేలా చేశారు. కాని నోట్ల రద్దు వల్ల ఈ సినిమా కలక్షన్స్ పై భాగా ప్రభావితం చూపించింది. ముఖ్యంగా బి,సి సెంటర్స్ లో ధ్రువ కలక్షన్స్ కాస్త నిరాశ చెందేలా చేశాయి.

అయితే టోటల్ కలక్షన్స్ లో మాత్రం ధ్రువ ఇరగదీసింది. 4 కోట్లకు రీమేక్ రైట్స్ తీసుకున్న అల్లు అరవింద్ 50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి తీశారు. ఓవరాల్ గా సక్సెస్ అని చెప్పుకున్నా ధ్రువ ఓ రెండు నెలలు ముందు వచ్చుంటే మాత్రం కచ్చితంగా మరో రేంజ్లో సక్సెస్ అయ్యి ఉండేది.

SHARE