ఏపీ 1200- తెలంగాణ 800= 400 మెగావాట్లు

0
273
Power Supply worried In Telangana And Andhra Pradesh

 

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లైనా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంతవరకూ కొలిక్కిరాలేదు. మొదట ఉద్యోగుల పంచాయితీ, తర్వాత నిధుల పంచాయితీ. ఆ తర్వాత జల పంచాయితీ. ఇప్పుడు కొత్తగా విద్యుత్ పంచాయితీ షురూ అయింది. కొత్త రాష్ట్రాల్లో విద్యుత్ విషయంలో సర్దుకుపోతామని, తెలుగు రాష్ట్రాలకు మిగులు విద్యుత్ ఇచ్చాకే మిగతాది అమ్ముకుంటామని రెండు రాష్ట్రాలు గర్వంగా ప్రకటించుకున్నాయి. కానీ ఆచరణలో మాత్రం దారుణంగా విఫలమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల కరెంట్ లెక్కలు చూస్తే.. తెలంగాణకు ఏపీ 1200 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తోంది. ఏపీకి తెలంగాణ 800 మెగావాట్ల పవర్ సప్లై ఇస్తోంది. ఇప్పటివరకూ ఈ సరఫరా సజావుగానే సాగింది. కానీ తెలంగాణ మూడేళ్లుగా తమకు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, నాలుగు వేల కోట్లు రావాలని ఏపీ లేఖ రాసింది. అంతటితో ఆగకుండా డబ్బులు ఇవ్వకపోతే పవర్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

ఏపీ లేఖకు ఘాటుగా జవాబిచ్చిన తెలంగాణ సర్కారు.. ఏపీనే తమకు 1650 కోట్లు బాకీ ఉందని ఎదురుదాడికి దిగింది. విభజన చట్టం పన్నెండో షెడ్యూల్ ప్రకారం ఏపీకి తామేమీ డబ్బులివ్వక్కర్లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇప్పుడు విద్యుత్ పంచాయితీ ముదిరి పాకాన పడింది. రెండు తెలుగు రాష్ట్రాల చర్చలతో పరిష్కరించుకోవాలి. లేదంటే కేంద్రమే రంగంలోకి దిగి నచ్చజెప్పాల్సి ఉంటుంది. ఇరు రాష్ట్రాలు ఓ మెట్టు దిగితే బాగుంటుందనేది ప్రజల భావన.

Leave a Reply