Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభాస్ నాలుగు సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ప్రభాస్ స్థాయి బాలీవుడ్‌కు చేరింది. బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నిలిచేంతగా ప్రభాస్ స్థాయి పెరిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని వెయ్యి కోట్లను ప్రభాస్ ‘బాహుబలి 2’తో చేరుకోబోతున్నాడు. ఈ సమయంలోనే ప్రభాస్ ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకోవాలి.
ఎంత జాగ్రత్తగా సినిమాల ఎంపిక చేసినా కూడా ప్రభాస్ రాబోయే రెండు మూడు సినిమాలు ఫ్యాన్స్‌కు ఎక్కే అవకాశాలు తక్కువే అంటున్నారు. అయినా కూడా ప్రభాస్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘సాహో’ సినిమాకు రంగం సిద్దం అయ్యింది. ‘సాహో’తో పాటు మరో సినిమాను కూడా ప్రభాస్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు హోం బ్యానర్‌లో ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్‌తో ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించి స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేసేందుకు దాదాపుగా ఓకే చెప్పాడు. ఇటీవలే రాధాకృష్ణ స్క్రిప్ట్ చెప్పడం, అందుకు ఓకే అనడం జరిగి పోయింది. గ్యాప్ ఎక్కువ వచ్చిన కారణంగా ఒకేసారి రెండు రెండు సినిమాలు చేయాలనేది ప్రభాస్ ప్లాన్‌గా తెలుస్తోంది.