బాహుబలి కి వేసవి వేడి తోడు ..

Posted January 7, 2017

prabhas bahubali movie release on summer
బాహుబలి షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో ఇక సినిమా విడుదల ఎప్పుడన్నదానిపై అందరి దృష్టి పడింది.గ్రాఫిక్స్ పనులు అయ్యేందుకు ఇంకాస్త టైం పడుతుంది.అంటే సమ్మర్ కి బాహుబలి 2 విడుదల అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి అయితే ఏప్రిల్ 28 న సినిమా రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో వుంది.ఏదైనా వర్క్ పెండింగ్ లో పడితే ఎట్టి పరిస్థితుల్లో మే 2 వ వారంలో సినిమా విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నారట. పెద్ద మొత్తం పెట్టి కొన్న సినిమా కావడంతో వేసవి మిస్ కాకూడదని వారి అభిప్రాయం.

ఇప్పటిదాకా రాజమౌళి ఎన్ని సినిమాలు చేసినా వేసవిలో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. రాజమౌళి సినిమాలకి వేసవి సీజన్ కూడా తోడైతే ఆ వేడి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు .అందుకే ఈసారి వేసవికి ఎలాగైనా బాహుబలి రిలీజ్ చేయాలని జక్కన్న కూడా రెడీ అయిపోతున్నాడు. అంటే బాహుబలికి ఈసారి వేసవి వేడి కూడా తోడైనట్టే …

SHARE