రజని స్థానం పై ప్రభాస్ కన్ను ?

  prabhas beat rajini position
రజనీకాంత్ ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రపంచవ్యాప్తంగా అయన మార్కెట్ పెరగడానికి దక్షిణాదిన గట్టి పునాది పడింది.ఒక్క తమిళ్ లోనే కాకుండా దక్షిణాదిన మిగిలిన మూడు భాషల్లోనూ స్టార్ హీరో ల రేంజ్ లో రజని సినిమాల ఓపెనింగ్స్ ఉంటాయి.హిట్ టాక్ వస్తే ఇక కలెక్షన్స్ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆలా అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకునేందుకు దక్షిణాది స్టార్ హీరో లంతా ప్రయత్నిస్తున్నారు.అయితే పెద్దగా ప్లాన్ చేయకుండానే బాహుబలి రూపంలో ప్రభాస్ సైతం ఈ రేసులోకి వచ్చారు .

బాహుబలికి ఏ స్థాయి కలెక్షన్స్ వచ్చినా ఆ క్రెడిట్ లో సింహభాగం రాజమౌళిదే అవుతుంది.బాహుబలి తరువాత కూడా అదే మేజిక్ రిపీట్ చేయగలిగితే పెరిగిన మార్కెట్ నిలబడుతుంది.ప్రభాస్ ఈ విషయాన్ని గమనించే రాబోయే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.సబ్జెక్టు ,మేకింగ్ పరంగా యూనివర్సల్ అప్పీల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.యువీ క్రియేషన్స్ లో రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఒప్పుకున్న సినిమాకి ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వబోతున్నారు.

తెలుగు,తమిళ్,హిందీ మూడు భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడమే కాకుండా …అదే స్థాయిలో నిర్మించడానికి పూనుకున్నారు. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని భారీగా నిర్మించబోతున్నారు.మిగతా భాషల్లో పేరున్న నటులు,సాంకేతిక నిపుణుల్ని అందులో భాగం చేస్తున్నారు.ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి బాహుబలి తరువాత సినిమాలు కూడా అన్ని భాషల్లోహిట్అయితే రజని చైర్ మీద ప్రభాస్ కన్ను పడినట్టే..

SHARE