బాహుబలి కోసం ప్రభాస్ వాలీబాల్ ఆడడా..?

Posted April 11, 2017

prabhas fitness secretప్రభాస్.. ఇప్పుడు ఇండియా అంతా మారుమోగుతున్న పేరు. ప్రతి సినిమాలో తన నటనతో,బాడీ లాంగ్వేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతేయకంగా బాహుబలి మూవీ కోసం బరువు పెరుగుతూ,బరువు తగ్గుతూ ఎంతో కష్టపడి తన బాడీ ని చాలా చేంజ్ చేసి ఎంతో అందంగా తయారయ్యాడు.. ప్రభాస్ తన బాడీని ఇలా ఎలా చేంజ్ చేసుకుంటున్నాడంటే..

ప్రభాస్ తన ఇంట్లో ప్రత్యేకంగా ఒక ఇసుక వాలీబాల్ కోర్ట్ ని నిర్మించాడు.. ఈ ఇసుక వాలీబాల్ కోర్ట్ లో ఆట ఆడటం అంత తేలికైన విషయం కాదు, చాలా కష్టం, కానీ బాహుబలి మూవీ కోసం ఎంతో కష్టపడి ప్రతిరోజు ఈ కోర్ట్ లో ఆట ఆడి తన బాడీ ఫిట్నెస్ ని తనకు కావలసిన విధంగా మార్చుకోగలిగాడు. ఇలా వాలీబాల్ ఆడటం వలన బాడీ లోని ప్రతి పార్ట్ కదిలి మైండ్ మరియు స్కిల్ల్స్ చాలా డెవలప్మెంట్ అవుతాయి.బాహుబలి సినిమాకి ట్రైనింగ్ అవ్వటం కోసం చాలా సేపు ఇలా వాలీబాల్ ఆడుతూ ప్రతిరోజు చాలా కష్టపడుతూ ఉండేవాడు.

జిమ్ లోనే కాకుండా ఇలా వాలీబాల్ ఆడుతూ తన బాడీ ని తనకు కావాల్సిన విధంగా మార్చుకుంటూ, తన ఆలోచనన విధానాలని, తన పద్దతులని మార్చుకుంటూ ఇంటా బయట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇంత కష్టపడ్డాడు కాబట్టి బాహుబలి మూవీని అంతమంది ఇష్టపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ తన ఫాన్స్ ని ఆనందపరచడం కోసం ఇలా తయారు అవ్వటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం.

SHARE