పవన్, మహేష్ లకు రాని నంది ప్రభాస్ కి ఎలా వచ్చిదంటే..?

0
682
prabhas got nandi award from mirchi movie

Posted [relativedate]

prabhas got nandi award from mirchi movieదాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఏపి ప్రభుత్వం నిన్న నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2013 ఉత్తమ చిత్రంగా మిర్చి, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా  అత్తారింటికి దారేది సినిమాలు నంది అవార్డులను గెలుచుకున్నాయి. అయితే 2013 బెస్ట్ హీరోగా ప్రభాస్ నందిని కొట్టేశాడు.  పవన్ కళ్యాణ్  నటించిన అత్తారింటికి దారేది ఆ సంవత్సరం ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో టాలీవుడ్ అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అలాగే మహేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టింది. కానీ ఉత్తమ కధానాయకుడిగా ప్రభాస్ కి అవార్డ్ ఇవ్వడంతో అభిమానులు మండిపడున్నారు.  ఈ నంది అవార్డుల ఎంపిక విషయంలో తమ అభిమాన హీరోలకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేస్తున్నారు.  పవన్‌, మహేష్ లు కుటుంబ కథా చిత్రాల్లో  నటించి మెప్పించారని,  ఫ్యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కిన మిర్చి హీరోకు ఈ అవార్డు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాదంపై బోర్డు సభ్యులు ఒకరు స్పందించారు. బెస్ట్ హీరో ఎంపిక విషయంలో జరిగిన ఉదంతాన్ని వివరించారు. పవన్ గానీ  మహేష్ ని  ఎంపిక చేయకపోవడానికి కారణాలు ఉన్నాయన్నారు. నిజానికి బెస్ట్ హీరోగా ప్రభాస్‌ గానీ , బెస్ట్ మూవీగా మిర్చిగానీ అసలు చాయిసే కాదని వెల్లడించారు. అత్తారింటికి దారేది సినిమాకుగాను పవన్ కళ్యాణ్‌ ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేయాలని జ్యురీలోని మెజారిటీ సభ్యులు సూచించారట. మరి కొందరు మహేష్ పేరును సెలెక్ట్ చేశారట.  ఏపిలో అధికారంలో ఉన్న టీడీపీకి పవన్ మిత్రుడు. అలాగే  మహేష్ బావ గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నారు. కాబట్టి  బెస్ట్ హీరోగా పవన్‌ ని సెలెక్ట్ చేస్తే అది టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్టు అవుతుందని , అలాగే మహేష్ ను ఎంపికచేసినా  తప్పు  సంకేతాలనే ఇచ్చినట్లవుతుందని ఆయన వివరించారు. దీంతో ప్రభాస్ ని ఎంపిక చేశామన్నారు. సో.. ఆ సంవత్సరం  గ్యాప్ తీసుకుని విడుదలైనా  బాక్సాఫీస్ వద్ద  కలెక్షన్ల   పరంగా పవన్, మహేష్ లు కొట్టుకుంటే  చివరికి ప్రభాస్ నందిని  పట్టేశాడన్నమాట. 

Leave a Reply