గంటా రవి భవిష్యత్తులో ప్రభాస్‌ అంత ఎదుగుతాడట!

0
580
Prabhas is coming up in the future

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Prabhas is coming up in the future
ప్రభాస్‌ను ‘ఈశ్వర్‌’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ప్రభాస్‌ కెరీర్‌కు మంచి స్టార్టింగ్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌ రేంజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక జయంత్‌ సి పరాన్జీ టాలీవుడ్‌ స్టార్‌ హీరోల అందరితో సినిమాలు చేశాడు. కాని ప్రస్తుతం మాత్రం ఆయనకు అవకాశాలు పెద్దగా లేవు. ఆయన తెరకెక్కించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవ్వడంతో ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్స్‌ ఆసక్తి చూపడం లేదు. దాంతో తాజాగా ఏపీ మంత్రి గంట తనయుడు గంట రవితేజ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించాడు.

గంట రవితేజ, మాళవికలు జంటగా తెరకెక్కిన ‘జయదేవ్‌’ చిత్రానికి జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, తప్పకుండా రవితేజ మంచి స్థాయికి చేరుకుంటాడని జయంత్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్‌ ఉన్న స్థాయికి రవితేజ చేరుతాడనే నమ్మకం తనకు ఉందని, రవితేజలో ఉన్న కష్టపడే తత్వంతో పాటు, మంచి నటన ప్రతిభతో ఆకట్టుకుంటాడని రవితేజ భవిష్యత్తులో ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడని, అలాగే హీరోయిన్‌ మాళవికకు కూడా మంచి భవిష్యత్తు ఉందని జయంత్‌ సి పరాన్జీ చెప్పుకొచ్చాడు.

Leave a Reply