బ్యానరే ఈయనది.. పారితోషికం ఏంటి?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

prabhas not taking remuneration to saaho movie
ప్రభాస్‌ హీరోగా ‘సాహో’ సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్దం అవుతుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో, బాలీవుడ్‌ నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ వద్దన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌ మంచి మనస్సుతో వారు తన స్నేహితులు మరియు బందువులు అన్న ఉద్దేశ్యంతోనే ‘సాహో’ సినిమాకు పారితోషికం వద్దన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ముగ్గురు భాగస్వాములు. వారు వంశీ, ప్రమోద్‌, ప్రభాస్‌.

యూవీ క్రియేషన్స్‌ను ప్రభాస్‌ సహకారంతోనే వంశీ మరియు ప్రమోద్‌లు ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో మిర్చిని మొదటి సినిమాగా నిర్మించారు. ఆ తర్వాత పలు సినిమాలను యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఆ సినిమాలన్ని కూడా ప్రభాస్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించినవే. ‘మిర్చి’ చిత్రానికి ప్రభాస్‌ పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటాను తీసుకున్నట్లుగా అప్పుడే వెళ్లడి అయ్యింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ప్రభాస్‌ సాహోలో నటించినందుకు వంశీ మరియు ప్రమోద్‌ కంటే ఎక్కువ లాభాలను తీసుకోవాల్సి ఉంటుంది. కాని ఆ ఎక్కువ లాభం తీసుకోకుండా వారితో పాటు సమానంగానే ప్రభాస్‌ లాభాల్లో వాటాను తీసుకుంటాడని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ భాగస్వామ్యుల్లో ప్రభాస్‌ ఒక్కడు అయినప్పుడు పారితోషికం విషయమే చర్చకు రాదు. కాని మీడియాలో మాత్రం ఈ విషయమై కాస్త ఎక్కువ ప్రచారం జరుగుతుంది.

Leave a Reply