రానాకు పొగరని వి6 ఇంటర్వ్యూలో వెల్లడైంది..!

0
500
prabhas rana and anushka v6 bahubali 2 movie interview

Posted [relativedate]

prabhas rana and anushka v6 bahubali 2 movie interview
‘బాహుబలి’ చిత్రంలో విలన్‌గా నటించిన రానాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. దేశ వ్యాప్తంగా రానా క్రేజ్‌ అమాంతం పెరిగింది. అయితే ‘బాహుబలి’ సినిమా షూటింగ్‌ సమయంలో రానా ఆ పాత్రలో లీనమై పోయేవాడట. ఆ రాజ్యం అంతా తనది అని, తన సింహాసనం మీద ఎవరు కూర్చోవద్దని సెట్స్‌లో అందరిని బెదిరించేవాడట. తన కిరీటం మరియు గదను ఏ ఒక్కరు ముట్టుకున్నా కూడా సహించేవాడు కాదట. తాజాగా ఈ విషయం వి6కు ప్రభాస్‌, రానా, అనుష్క వచ్చిన సందర్బంగా వెల్లడైంది.

వి6 యాంకర్‌ సావిత్రి సరదాగా ప్రభాస్‌, రానా, అనుష్కలతో ముచ్చటించింది. ఆ సందర్బంగానే రానాలో కొత్త యాంగిల్‌ కనిపించింది. నాలుగు సంవత్సరాలుగా రానా ఆ సామ్రాజ్యం నాది, ఆ సింహాసనం నాది అంటూ కూర్చున్నాడు. ఆయన ఉన్న సమయంలో సింహాసనం లేదా కిరీటాన్ని ఏ ఒక్కరు పట్టుకున్నా కూడా ఊరుకునేవాడు కాదు అని ప్రభాస్‌ మరియు అనుష్క ఇద్దరు కూడా చెప్పుకొచ్చారు. ఈ గొడవంత ఎందుకు వచ్చిందంటే, యాంకర్‌ బాహుబలి సామ్రాజ్యాన్ని మీరు లాక్కున్నారు అంటూ అనడంతో అది నా సామ్రాజ్యం, నేను లాక్కోలేదు అంటూ రానా కాస్త సీరియస్‌గానే చెప్పాడు. ఆయన మాటలో పొగరు క్లీయర్‌గా కనిపిస్తుంది.

Leave a Reply