ప్రభాస్ అడ్వాన్స్ రెజెక్ట్ చేయడానికి కారణం?

Posted March 20, 2017

prabhas reject advance from big producers because of uv creationబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్  రేంజ్ మారిపోయింది అని ఒప్పుకోక తప్పదు. వర్మ అన్నట్లుగా రెండే దెబ్బలతో ఇంటర్నేషనల్ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు. ఐదేళ్లుగా తన సినీ జీవితాన్ని కేవలం బాహుబలికి మాత్రమే అంకితం చేసిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలను చేయనున్నాడు. దీంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్ధలు ప్రభాస్ వెంటపడుతున్నాయి.

మ‌హేష్‌ బాబుతో.. శ్రీ‌మంతుడు, ఎన్టీఆర్‌ తో.. జ‌న‌తా గ్యారేజ్  వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కించిన  మైత్రీ మూవీస్  సంస్థ ప్ర‌భాస్‌ తో సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్ర‌భాస్‌ ని క‌లిసి అడ్వాన్సులు ఇచ్చేందుకు కూడా ప్ర‌య‌త్నించిందట‌. అయితే ప్ర‌భాస్ బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో నటిస్తుండడంతో మైత్రీ మూవీస్  ఆఫ‌ర్‌ ని తిర‌స్క‌రించాడ‌ని సమాచారం. ఫ్యూచర్ లో కలిసి పనిచేద్దాం అని చెప్పిన  ప్రభాస్ అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. ప్ర‌భాస్ అడ్వాన్స్ రెజెక్ట్ చేయడానికి కారణం ఉందని అతని సన్నిహితులు చెబుతున్నారు. యు.వి.క్రియేష‌న్స్ ప‌తాకంపై సినిమాలు తీస్తున్న  ప్ర‌మోద్‌, వంశీలు తన బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో ప్రభాస్ ఆ బ్యానర్ లోనే వరుస సినిమాలు చేయడానికి  సుముఖత చూపిస్తున్నాడట.  అందుకే వేరే బ్యాన‌ర్ల జోలికి ప్ర‌భాస్ వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది. కాగా పెద్ద పెద్ద బ్యానర్ లు వచ్చి అడ్వాన్స్ ఇస్తామంటే ప్రభాస్ వద్దనడం మంచిది కాదని సినీ వర్గాలు అంటున్నాయి. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలని, తర్వాత చూద్దాం అంటే ఇక అది అటకెక్కేసినట్లేనని అంటున్నారు.  

SHARE