బాలయ్య డైలాగ్…ప్రభాస్ టైటిల్?

Posted April 3, 2017

prabhas sujeeth movie title sahoo
బాలయ్య హిట్ సినిమాల్లో పాటలు ఎంత పాపులర్ అవుతాయో డైలాగ్స్ కూడా అదే స్థాయిలో పాపులర్ అవుతాయి.ఇందుకు ఎన్నో ఉదాహరణలు వున్నాయి.సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల్లో డైలాగ్స్ ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తుంటాయి.తాజాగా బాలయ్య 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి డైలాగ్స్ కూడా అదే స్థాయిలో పేలాయి.ఆ సినిమాలో బాలయ్య చెప్పకపోయినా,ఆయన పాత్రని ఉద్దేశించి సాహో శాతకర్ణి అని సైనికులు చెప్పే డైలాగు జనాల్లోకి బాగా దూసుకెళ్లింది.ఆ పార్ట్ మీద ప్రభాస్ టీం దృష్టి పడింది.అందులో కాస్త కోత పెట్టి తమ కొత్త సినిమా టైటిల్ గా వాడుకోడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.

బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కి సొంత బ్యానర్ లాంటి యువీ క్రియేషన్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది.వాళ్ళే రన్ రాజా రన్ సినిమాతో పరిచయం చేసిన సుజిత్ కే ప్రభాస్ ని ఇచ్చి ఇంకో భారీ అవకాశం ఇచ్చారు.పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని టాక్.ఈ సినిమాని తెలుగు,తమిళ్ ,హిందీ ల్లో విడుదల చేస్తారు.అందుకు తగ్గట్టే 100 కోట్లకి పైగా ఖర్చు పెడుతున్నారు.అంత భారీ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా అని ఆలోచించి ఆలోచించి చివరకు “సాహో”అనే పేరు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

SHARE