నాలుగు రోజుల్లో దానిపై క్లారిటీ ఇస్తానన్న ప్రభాస్‌!

Posted April 18, 2017

prabhas will giving clarity about on his next movie teaser
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘బాహుబలి 2’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక ప్రభాస్‌ నెక్ట్స్‌ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. షూటింగ్‌ ప్రారంభం కాకుండానే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ‘బాహుబలి 2’ చిత్రంతో పాటు ప్రభాస్‌, సుజీత్‌ల కాంబో మూవీ టీజర్‌ను థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై తాజాగా ప్రభాస్‌ స్పందించాడు.

సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా విషయమై మరో మూడు నాలుగు రోజుల్లో ఒక క్లారిటీ రానుందని చెప్పుకొచ్చాడు. అంటే ప్రస్తుతం టీజర్‌ రెడీ అవుతుందని ప్రభాస్‌ మాటల్లో వెళ్లడైంది. దాదాపు 150 కోట్లతో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ సాయంతో రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి ప్రభాస్‌ బాలీవుడ్‌ లెవల్‌లో దుమ్ము లేపడం ఖాయం అని ఆయన అభిమానులు అంటున్నారు. ప్రభాస్‌ మిత్రులు వంశీ మరియు ప్రమోద్‌లు ఈ సినిమాను యూవీ క్రియేషన్‌లో నిర్మించనున్నారు. ఇదే సంవత్సరం ప్రభాస్‌, సుజీత్‌ల చిత్రం విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు

SHARE