చెయ్యి చూసి చెప్పనున్న ప్రభాస్…

0
450

 prabhs act new movie play role astrologer

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. నెక్స్ట్‌ మూవీకి రంగం సిద్ధమైపోతోంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ డైరక్షన్‌లో మరో పిక్చర్‌ చేయనున్నాడు. ఈ చిత్రంలోనే ప్రభాస్ జాతకాలు చెప్పే యువకుడి రోల్ చేస్తున్నాడట.

ఈ సినిమా పూర్తిస్థాయి యురోప్ లో జరిగే ప్రేమకథ అని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమాలో ప్రభాస్ ఒక టారాట్ రీడర్ పాత్ర చేస్తున్నాడట. మొహం, చేతు చూసి.. జాతకం చెప్పే ఎక్స్‌పర్ట్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇలాంటి యువకుడికి ఓ అందమైన అమ్మాయితో ప్రేమ.. తర్వాత వచ్చిపడే ట్విస్టులు వినోదాత్మకంగా ఉంటాయని దర్శకుడు రాధాకృష్ణ చెప్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే దర్శకనిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.

Leave a Reply