నయనతార సినిమాలో  విలన్ గా ప్రభుదేవా!!

Posted March 20, 2017

prabhu deva villain in nayanatara movieనయనతార.. ఈమె సినీ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో.. ఆమె పర్సనల్ జీవితంలో అన్ని లవ్ బ్రేకప్స్ ఉన్నాయి. మొదట శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ప్రభుదేవని లవ్ చేసింది. పెళ్లి పీటలు వరకు వెళ్లిన వీరి ప్రేమ అనుకోకుండా బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్‌ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న  ఈ అమ్మడు అతనికి కూడా బ్రేకప్ చెప్పిందని కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. ఇంత జరిగినా నయనతార మాత్రం కెరీర్… కెరీరే, పర్సనల్.. పర్సనల్లే అంటోంది.

nayanthara act with simbu prabhudeva after love break upగతంలో శింబుతో ప్రేమ ఫెయిల్ అయ్యినా కానీ నయన్ అతనితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేసింది. తాజాగా ఇప్పుడు ప్రభుదేవతో కలిసి తెర పంచుకోనుంది. దర్శకుడు చక్రి తోలేటి తెరకెక్కించనున్న ఓ లేడీ  ఓరియెంటెడ్ సినిమాలో నయన తార హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రభుదేవ విలన్ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ లో తమన్నా హీరోయిన్  కాగా అందులో కూడా విలన్ గా ప్రభుదేవానే నటిస్తున్నాడని సమాచారం.

SHARE