ఆ బ్యాంకులో రాజకీయ ఆట … చివరకు రాజీమాట

0
567

 

prakasam district cooperative central bankప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ … ఈ బ్యాంక్ కేంద్రంగా సాగిన రాజకీయ ఆట ప్రస్తుతానికి ముగిసింది. ఎవరు గెలిచారో? ఎవరు ఓడారో? అందరికీ తెలుసు… కానీ రిజల్ట్ కు ముందు రాజీ ప్రపోజల్ … పెద్దలరాక … పార్టీ పరువు … వెరసి రసవత్తర రాజకీయ క్రీడ డ్రాగా ముగిసింది.

ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఛైర్మన్ గా ఈదర మోహన్ వున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలతో మస్తానయ్య వైస్ చైర్మనుగా ఎన్నికయ్యారు. దివాలాకు దగ్గరగా వున్న ఓ సంస్థకు రుణం చేయడానికి ఆయన విశ్వప్రయత్నం చేశారు. పనికాకపోవడంతో చైర్మన్ ఫై పరోక్షయుద్ధం ప్రకటించారు. విషయం తెలుసుకున్న మోహన్ సదరు వైస్ చైర్మన్ ఫై బోర్డు లో అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించారు. చర్చలు, కోర్టులు, సవాళ్లు, కిడ్నాపులు … ఇలా అన్ని పర్వాలు ముగిశాయి. వైస్ చైర్మన్ కి అండగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బేరసారాలు చేశారు. కానీ బోర్డులో వైస్ కి అండగా మెజార్టీ తేలేకపోయారు.

ఓటింగ్ జరిగితే వైస్ చైర్మన్ పదవి పోవడం ఖాయం. ఈ ఆటలో అందరూ అధికార పక్ష నేతలే… ఈ అంశమే ఓడిపోయే వారికీ కలిసివచ్చింది. పార్టీ పరువు పోతుందంటూ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగారు. మధ్యే మార్గంగా ఓ ఫార్ములా రూపొందించారు. వైస్ చైర్మన్ తో రాజీనామా చేయించడానికి ఒప్పందం కుదిరింది. 45 రోజుల తర్వాత ఆయన రిజైన్ చేస్తారు. చేయకపోతే? మరేదయినా ప్రయత్నం చేస్తే? ఈ డౌటులతోటే అందుకు తగ్గ జాగ్రత్తలు పార్టీ పెద్దలు తీసుకొన్నారట. మొత్తానికి అధికార పక్ష నేతల మధ్యే … ఓ బ్యాంక్ కేంద్రంగా సాగిన రాజకీయ ఆటకు, రాజీ మాటతో ఇప్పటికి తెరపడింది.

Leave a Reply