ప్రకాశం జిల్లా బిడ్డ తమిళనాడుని ఏలాడా?

prakasam district man karunanidhi ruling tamilnadu
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళనాడు రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. జయ మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఖాళీని పూరించడానికి సూపర్ స్టార్ రజని కాంత్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఫాన్స్ పలికినట్టు అంతటా ఆహ్వానాలు ఏమీ రాలేదు రజనికి.పైగా కొన్ని తమిళ సంస్థలు రజని మరాఠీ వాడని,కర్ణాటక నుంచి వచ్చాడని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఆయన్ని రాజకీయాల్లో రావొద్దని నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం కూడా చూసిందే.భారతీరాజా లాంటి దర్శకుడు ఓ అడుగు ముందుకేసి ముతకమాటలు కూడా వాడేశారు.”నా భార్య కి గర్భం రాకుంటే పక్కింటివాడు బిడ్డకి తండ్రి అవుతాడా?” అన్నంత స్థాయిలో మాట్లాడారు. కావేరి వివాద సమయంలో జయ కన్నడ మూలాల్ని కూడా భారతీరాజా ఎత్తి చూపారు. ఇదంతా బయటపకుండా డీఎంకే ఆడిస్తున్న నాటకమని రజని ఫాన్స్ భావిస్తున్నారు.అందుకే డీఎంకే అధినేత కరుణానిధి మూలాల్ని కూడా తవ్వితీశారు.

రజని ఫాన్స్ చెబుతున్న దాని ప్రకారం డీఎంకే అధినేత కరుణానిధి తమిళుడు కాదు తెలుగువాడు. 1924 లో ఇదేరోజున అంటే జూన్ 3 న తంజావూరు జిల్లా,తిరుక్కువలం లో జన్మించారు.కానీ కరుణానిధి అసలు పేరు ఇప్పుడు పిలిచేది కాదు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి.కరుణ పూర్వీకులు తెలుగువాళ్లు అయినందునే ఆ పేరు పెట్టారని రజని ఫాన్స్ వాదిస్తున్నారు.పైగా కరుణ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నుంచి తమిళనాడుకి వలస వచ్చినట్టు వారు చెబుతున్నారు.ఇదే నిజమైతే,ఈ వాదాన్ని రజని ఫాన్స్ బలంగా వినిపిస్తే పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.దీనివల్ల 94 వ పుట్టినరోజు జరుపుకుంటూ రాజకీయ,జీవన ప్రస్థానం ముగింపుదశలో వున్న కరుణానిధికి పెద్దగా పోయేదేమీ ఉండదు.కానీ ఆయన కుమారుడు స్టాలిన్ కి కొంత ఇబ్బంది తప్పదు.అప్పుడు రజనికి కూడా స్థానికేతరుడనే విమర్శ నుంచి బయటపడటం తేలికవుతుంది. కాదంటారా? ఈ విషయం మీద తమిళనాడులో చర్చ ఓ రకంగా ఉంటే కరుణ మనవాడేనంటూ ప్రకాశం జిల్లా వాసులు సంతోషపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here